Cricket : మూతికి కుట్లు.. తీవ్రమైన నొప్పి.. అయినా జట్టుకోసం బరిలోకి..! తమిళనాడు క్రికెటర్‌కి క్రీడా లోకం సెల్యూట్!

విజయహజరే ట్రోఫీ సెమీస్‌లో బాబా ఇంద్రజిత్‌ పట్టుదలకు, తెగింపుకు యావత్‌ క్రీడా లోకం సెల్యూట్ చేస్తోంది. మూతికి బలమైన గాయమైనా.. రక్తం కారుతున్నా.. నోటికి టేప్‌ వేసుకోని వచ్చి హాఫ్‌ సెంచరీ చేశాడు ఇంద్రజిత్‌. ఇన్నింగ్స్‌ బ్రేక్‌ సమయంలో ఇంద్రజిత్‌ బాత్‌రూమ్‌లో జారి పడ్డాడు.

New Update
Cricket : మూతికి కుట్లు.. తీవ్రమైన నొప్పి.. అయినా జట్టుకోసం బరిలోకి..! తమిళనాడు క్రికెటర్‌కి క్రీడా లోకం సెల్యూట్!

Baba Indrajith : జీవితంలో క్రికెట్‌(Cricket) నేర్పే పాఠాలు అన్నీఇన్నీకావు. ఎలా పోరాడాలో ఆట నేర్పిస్తుంది. కింద పడ్డా పైకి ఎలా బౌన్స్ అవ్వాలో ఆటగాళ్లు నేర్పిస్తారు.. గివ్‌ అప్‌ మీనింగే తెలియని ఎందరో ఆటగాళ్లను క్రికెటర్‌ మనకు పరిచయం చేసింది. గాయపడ్డా.. కిందపడ్డా.. తీవ్రమైన నొప్పి వేధిస్తున్నా.. జట్టుకోసం తలకు కట్లు కట్టుకోని మరి వచ్చిన ఆటగాళ్లున్నారు. రక్తం కారుతున్నా.. శరీరంలోని ఆఖరి బ్లడ్‌ డ్రాప్‌ వరకు ఫైట్ చేస్తారు. ఈ వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ డబుల్ సెంచరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా(Australia)ను చివరి వరకు పోరాడిన మ్యాక్సీ అద్భుత ఇన్నింగ్స్‌తో గెలిపించాడు. టార్గెట్‌ 292 పరుగులైతే అందులో మ్యాక్స్‌వెలే 201 రన్స్‌ చేశాడంటే అర్థం చేసుకోవచ్చు. అది కూడా గాయంతో.. పరుగు తియ్యలేని పరిస్థితులో.. కుంటుకుంటూ ఆసీస్‌ను గెలిపించాడు మ్యాక్స్‌వెల్‌(Maxwell). ఇక తాజాగా అలాంటి ఫైటింగ్‌ గేమ్‌నే చూపించాడు తమిళనాడు కుర్రాడు బాబా ఇంద్రజిత్(Baba Indrajith).


అసలేం జరిగిందంటే?
ప్రస్తుతం విజయ హజరే(Vijaya Hazare) ట్రోఫీ జరుగుతున్న విషయం తెలిసిందే. హర్యానాతో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ సెమీఫైనల్ సందర్భంగా బాబా ఇంద్రజిత్ పట్టుదలను చూసి యావత్‌ క్రీడా లోకం సెల్యూట్ చేస్తోంది. నోటికి టేప్‌ వేసుకోని వచ్చి బ్యాటింగ్‌ చేశాడు. హర్యానాపై 294 పరుగుల ఛేదనలో ఇంద్రజిత్ బ్యాటింగ్‌కు దిగినప్పుడు తమిళనాడు తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. 54 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఉంది. అయితే హర్యానా-తమిళనాడు ఇన్నింగ్స్‌ బ్రేక్‌ సమయంలో స్నానానికి వెళ్లిన బాబా ఇంద్రజిత్‌ జారి పడ్డాడు. అంతే.. మూతి పగిలింది. బ్లడ్‌ కారింది. నొప్పికి విలవిలలాడిపోయాడు. టెంపరరీగా ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాతే ఆస్పత్రికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. చూస్తుండుగానే మూడు వికెట్లు పడిపోయాయి. ఓవైపు మూతి నుంచి రక్తం కారుతోంది. మరోవైపు బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. దీంతో మూతికి టేప్‌ వేసుకోని గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడు ఇంద్రజిత్‌.

సెల్యూట్‌ బ్రో:
కష్టాల్లో ఉన్న తమిళనాడును తన బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు బాబా ఇంద్రజిత్. అయితే 71 బంతుల్లో 64 రన్స్‌ చేసిన ఇంద్రజిత్‌ ఔటైన తర్వాత తమిళనాడు విజయంవైపు అడుగులు వెయ్యలేకపోయింది. చివరకు బోల్తా పడింది. 63 పరుగుల తేడాతో హర్యానా గెలిచింది. అయితే ఇంద్రజిత్ తన జట్టు పట్ల చూపిన అంకితభావానికి ప్రశంసలు అందుకున్నాడు. ఔటైన తర్వాత ఆస్పత్రికి వెళ్లిన ఇంద్రజిత్‌కు కుట్లు పడ్డాయి. ఇక అసలు బాబా ఇంద్రజిత్ మూతికి టేప్‌తో ఎందుకు వచ్చాడో చాలా మందికి తెలియదు. అసలేం జరిగిందో ఇంద్రజిత్‌ చెప్పుకోచ్చాడు. బాత్‌ చేసిన సమయంలో జారి పడ్డానని.. అందుకే ఇలా గాయమైందని చెప్పాడు. ఇంద్రజిత్‌ చూపిన తెగువకు యావత్‌ క్రీడా లోకం సెల్యూట్ చేస్తోంది.

Also Read: కమ్‌బ్యాక్‌ కెప్టెన్‌.. కమ్‌బ్యాక్‌ మెంటర్.. ఈసారి ప్రత్యర్థులకు దబిడి దిబిడే!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు