విదేశాల్లో సీక్రెట్ గా ఎంజాయ్ చేస్తున్న విజయ్, త్రిష.. లీకైన ఫోటోలు, నెట్టింట హాట్ టాపిక్!

ఇటీవల తలపతి విజయ్ బర్త్ డే కి త్రిష విష్ చేస్తూ వారిద్దరూ లిఫ్ట్‌లో ఉన్న ఒక ఫోటోను పంచుకుంది. ఈ ఫోటో వైరల్‌ అవుతున్న సమయంలోచాలా సందర్భాల్లో వీరిద్దరూ కలిసే విదేశాలకు వెళ్లారంటూ.. అందుకు రుజువుగా కొన్ని పాత ఫోటోలను వైరల్‌ చేస్తున్నారు.

New Update
విదేశాల్లో సీక్రెట్ గా ఎంజాయ్ చేస్తున్న విజయ్, త్రిష.. లీకైన ఫోటోలు, నెట్టింట హాట్ టాపిక్!

Vijay, Trisha Old Photos Going Viral : తమిళ్ ఇండస్ట్రీలో తలపతి విజయ్, త్రిష హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరూ జంటగా నాలుగు సినిమాల్లో నటించారు. గత ఏడాది 'లియో' మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు.ఇక రీసెంట్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్న నేపథ్యంలో తన చివరి సినిమాలోనూ త్రిషనే హీరోయిన్ గా నటిస్తుందనే ప్రచారం సైతం జరుగుతోంది. ఇక ఇటీవల విజయ్ బర్త్ డే కి విష్ చేస్తూ త్రిష వారిద్దరూ లిఫ్ట్‌లో ఉన్న ఒక ఫోటోను పంచుకుంది. ఆ ఫొటోకు ఆ ఇంగ్లీష్ సాంగ్ కూడా యాడ్ చేసింది.

publive-image

ఫొటోలే రుజువు...

ఈ ఫోటో వైరల్‌ అవుతున్న సమయంలో త్రిష, విజయ్‌ కలిసి ఉన్న ఫోటోలు అంటూ నెటిజన్లు వైరల్‌ చేస్తున్నారు. చాలా సందర్భాల్లో వీరిద్దరూ కలిసే విదేశాలకు వెళ్లారంటూ.. అందుకు రుజువుగా ఒక పాత ఫోటోను వైరల్‌ చేస్తున్నారు. అందులో విజయ్ ఒంటరిగా నడుస్తున్న ఫోటో ఒకటి ఉంది. మరో ఫోటోలో త్రిష పక్కన ఒక కాలుతో ఉన్న ఫోటో ఉంది. ఈ రెండూ కలిపి ఇప్పుడు కొందరు నెట్టింట వైరల్‌ చేస్తున్నారు. ఆ ఫోటోలలో విజయ్ ధరించిన షూ ఏదైతే ఉందో అదే త్రిష కూర్చున్న పక్కనే కనిపిస్తుంది.

publive-image

Also Read : ‘యక్షిణి’ లో వేదిక నట విశ్వరూపం.. హాట్ స్టార్ లో ట్రెండింగ్!

సీక్రెట్ ఎఫైర్ నడుస్తుందా?

దీంతో విజయ్, త్రిష తరచూ విదేశాలకు వెళ్తారని పలువురు చెబుతున్నారు.దీంతో ఈ ఇద్దరి మధ్య సీక్రెట్ ఎఫైర్ ఏమైనా నడుస్తుందా? అని కోలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. విజయ్ ఇదివరకే సంగీతను పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉన్నారు. గత కొన్నేళ్లుగా వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారని, విడాకులు కూడా తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో విజయ్, త్రిష ల మధ్య వ్యవహారం కోలీవుడ్ తో పాటూ సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది.

publive-image

Advertisment
తాజా కథనాలు