హీరోగా ఎంట్రీ ఇస్తున్న విజయ్‌ సేతుపతి కుమారుడు!

నటుడు విజయ్‌ సేతుపతి కుమారుడు హీరోగా తమిళ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. ఈ చిత్రానికి అనల్‌ అరుసు దర్శకత్వం వహిస్తున్నారు. ఇద్దరికీ ఇదే మొదటి చిత్రం.బాలనటుడిగా సూర్య తండ్రి సినిమాల్లో నటించాడు.

హీరోగా ఎంట్రీ ఇస్తున్న విజయ్‌ సేతుపతి కుమారుడు!
New Update

డాక్టర్‌ వారసులు డాక్టర్లు, లాయర్ల వారసులు లాయర్లు, సినీ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం కామనే. ఇప్పటికే చాలా మంది హీరోల వారసులు ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో హీరో కుమారుడు ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తుంది.

అతను ఎవరో కాదు తమిళ నటుడు విజయ్‌ సేతుపతి కుమారుడు సూర్య హీరోగా పరిచయం అవుతుండడంతోనే తండ్రి పేరు చెప్పుకుని ఎదగాలని నేను భావించడం లేదనే ఒక్క మాటతో అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకున్నాడు. సూర్య ప్రస్తుతం ఫైట్‌ మాస్టర్‌ అనల్‌ అరసు దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

అనల్‌ కి కూడా దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. సినిమా పేరు కూడా ఖరారు అయ్యింది. ఫీనిక్స్‌..అంటూ దీనికి నామకరణం చేశారు. యాక్షన్‌, స్పోర్ట్స్‌, డ్రామా ఇలా అన్నింటితో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమాని బ్రేవ్‌ మ్యాన్‌ పిక్చర్స్ ప్రొడక్షన్‌ సంస్థ నిర్మిస్తోంది. దీని షూటింగ్‌ చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైంది.

అయితే సూర్య పక్కన నటించే హీరోయిన్‌ ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. సినిమా ప్రారంభోత్సవంలో హీరో సూర్య మాట్లాడుతూ.. నా తండ్రి విజయ్‌ సేతుపతి నీడలో తాను ఎదగాలని అనుకోవడం లేదని , నాకంటూ ఓ ప్రత్యేకమైన పంథాను ఏర్పరచుకోవాలనుకుంటున్నాని వివరించాడు.

అందుకే తన పేరు పక్కన కూడా విజయ్‌ సేతుపతి పేరును తీసేసి కేవలం సూర్య అని మాత్రమే ఫిలిం మేకర్స్‌ పేర్కొంటున్నారని వివరించాడు. నేను హీరోగా పరిచయం అవుతుండడం పట్ల తన తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారని సూర్య తెలిపాడు. హీరోగా సూర్యకి మొదటి చిత్రం కావొచ్చు కానీ..సూర్య ఇంతకు ముందే పలు చిత్రాల్లో కనిపించాడు.

అది కూడా తండ్రి సినిమాలే అయినటువంటి నేనూ రౌడీనే, సింధుబాద్ చిత్రాల్లో సూర్య కనిపించాడు. కొత్త చిత్రం విడుదలై: పార్ట్ 2 లో కూడా అతిథి పాత్రలో కనిపిస్తున్నాడు. సూర్యని హీరోగా పరిచయం చేస్తున్న అనల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాక్కర్లేదు. తెలుగులో జనతా గ్యారేజ్‌, శ్రీమంతుడు, బ్రూస్ లీ, జై లవకుశ వంటి చిత్రాలకు ఫైట్‌ మాస్టర్‌ గా వ్యవహరించారు.

షారూఖ్‌ ఖాన్ నటించి రికార్డులు కొల్లగొట్టిన జవాన్‌ చిత్రాలకు అనల్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ గా పని చేశారు.

Also read: కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఎందుకు పూజలు చేస్తారో తెలుసా!

#cine-entry #surya #vijay-sethupathi #son
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe