/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-40-3.jpg)
Maharaja Movie : కోలీవుడ్ స్టార్ విజయ్‌సేతుపతి హీరోగా నటించిన ‘మహారాజ’ సినిమా ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించింది. సస్పెన్స్, సెంటిమెంట్‌తో అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ నిథిలన్ స్వామినాథన్ ప్రతిభకు అందరూ ఫిదా అయ్యారు.
జూన్ 14న విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్.. జులై 12 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి దాదాపు ఆరు వారాల నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతూ తాజాగా అరుదైన ఘనత సాధించింది. 'మహారాజ' ఓటీటీలో ఎక్కువమంది చూసిన సినిమాగా నిలిచింది.
#Maharaja most viewed Indian movie on netflix 👏👏
Will #Kalki2898AD beat this? 🤔#Prabhas #VijaySethupathi pic.twitter.com/vYbbT95wMm— Telugu Film Frame (@TeluguFilmFrame) August 22, 2024
Also Read : ఓటీటీ లవర్స్ కు షాకిచ్చిన ‘కల్కి’ మేకర్స్.. ఆ సన్నివేశాలు తొలగింపు
ఇప్పటివరకు ఈ మూవీని 18.6 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. దీని తర్వాతి స్థానాల్లో క్రూ (17.9 మిలియన్లు), లాపతా లేడీస్ (17.1 మిలియన్లు), సైతాన్ (14.8 మిలియన్లు), ఫైటర్ (14 మిలియన్లు), యానిమల్ (13.6 మిలియన్లు), డుంకీ (10.8 మిలియన్లు) ఉన్నాయి. ఈ రేర్ ఫీట్ తో సోషల్ మీడియాలో 'మహారాజ' మరోసారి ట్రెండింగ్ లో నిలిచింది.