/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-01T144853.024.jpg)
Maharaja Trailer : నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో విజయసేతుపతి (Vijay Sethupathi) 50వ చిత్రంగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'మహారాజ'. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో మమతా మోహన్ దాస్ (Mamata Mohan Das) కథానాయికగా నటించగా.. బాయ్స్ ఫేమ్ మణికందన్, అభిరామి, భారతిరాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 'లక్ష్మీ' ఎవరంటూ సస్పెన్స్ తో సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ లో విజయ్ సేతుపతిని ఓ సెలూన్ షాప్ నడిపే మహారాజా అనే వ్యక్తిగా పరిచయం చేశారు. ఆ తర్వాత హీరో తన ఇంట్లో లక్ష్మీ కనిపించడం లేదని.. కేసు ఫైల్ చేయాలనీ పోలీసులను కోరుతాడు. ఇక లక్ష్మీ అంటే.. నగలు, పెట్టెలు, డ్యాకుమెంట్లు, భార్య , సోదరి ఇవేవి కాదని చెబుతాడు హీరో. దీంతో ఈ లక్ష్మీ ఎవరనే తెలుసుకునే ప్రయత్నంలో పిచ్చెక్కిపోతూ ఉంటారు పోలీసులు. మరో వైపు ఒక ఇంట్లో ఏదో ఒక మిస్టరీ ఉన్నట్లుగా చూపించారు. అసలు ఈ లక్షీ ఎవరు..? దాని కోసం విజయ్ సేతుపతి ఎందుకు అలా అయ్యాడు అనేది ట్రైలర్ లో క్యూరియాసిటీని పెంచుతోంది.
#MaharajaTrailer out now
Tamil: https://t.co/2TRsLpehAe
Telugu: https://t.co/0MhtD2NsOT
Written and Directed by @Dir_Nithilan@anuragkashyap72 @mamtamohan @Natty_Nataraj @Abhiramiact@AjaneeshB @Philoedit @DKP_DOP @Selva_ArtDir @rajakrishnan_mr @ActionAnlarasu… pic.twitter.com/tR9MRdYgpk
— VijaySethupathi (@VijaySethuOffl) May 30, 2024
Also Read: Manamey: పిల్లల్ని పెంచడం యూట్యూబ్ చూసినంత ఈజీ కాదు.. శర్వానంద్ 'మనమే' ట్రైలర్ - Rtvlive.com