Vijay Sethupathi Clarity On Pushpa 2 Offer : కోలీవుడ్ (Kollywood) స్టార్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మహారాజ' చిత్రం ఇటీవల విడుదలై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమాకి మంచి ఆదరణ లభించడంతో చిత్ర యూనిట్ నిన్న హైదరాబాద్ (Hyderabad) లో థాంక్యూ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన రిపోర్టర్లు విజయ్ సేతుపతిని పలు ప్రశ్నలు అడగ్గా.. వాటికి ఆయన ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
'పుష్ప 2' రిజెక్ట్ చేయడం నిజమేనా?
‘పుష్ప 2’ (Pushpa 2) లో నటించే అవకాశం వస్తే రిజెక్ట్ చేశారని వార్తలొచ్చాయి. అది నిజమేనా? అని ఓ విలేకరి అడిగితే అందుకు సేతుపతి బదులిస్తూ.." నేను రిజెక్ట్ చేయలేదు. జీవితంలో అన్ని సార్లు నిజం చెప్పకూడదు. కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పడం మంచిది అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు.
Also Read : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ నటి.. గ్రాండ్‌గా వెల్ కమ్ చెప్పిన ఫ్యామిలీ: వీడియో
స్ట్రయిట్ తెలుగు మూవీ ఎప్పుడు?
ఇదే కార్యక్రమంలో మరో విలేకరి 'మీరు నేరుగా తెలుగులో మళ్లీ ఎప్పుడు నటిస్తారు?' అని అడిగితే.." తెలుగు చిత్రాల్లో నటించేందుకు నేను ప్రయత్నిస్తున్నా. కానీ మంచి కథ దొరకట్లేదు. దానికి తోడూ తెలుగులో అవకాశాలే ఎవరూ ఇవ్వట్లేదు" అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో విజయ్ సేతుపతి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.