Star Hero : మూడోసారి తండ్రి కాబోతున్న స్టార్ హీరో..!

తమిళ హీరో శివ కార్తికేయన్ మూడోసారి తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఓ అభిమాని త‌న కొడుకు పుట్టిన‌రోజు వేడుకకు శివకార్తికేయన్ భార్యతో కలిసి వెళ్లారు. ఆ వేడుకలో ఆర్తికి కాస్త పొట్ట ఉన్నట్లుగా కనిపించింది. అది బేబి బంప్ అయ్యి ఉండొచ్చని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు

New Update
Star Hero : మూడోసారి తండ్రి కాబోతున్న స్టార్ హీరో..!

Tamil Actor Siva Karthikeyan Going To Be A Father For Third Time : తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ మూడోసారి తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా అంతటా తెగ ప్రచారం అవుతుంది. రెమో, డాన్, డాక్టర్, మహావీరుడు వంటి సినిమాలతో శివ కార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు.

publive-image

యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈయన.. వరుస హిట్స్ తో తక్కువ టైం లో స్టార్ ఇమేజ్ కైవసం చేసుకున్నాడు. దీంతో శివ కార్తికేయన్ కి సౌత్ లో భారీ క్రేజ్ ఏర్పడింది. ఇక ప్రస్తుతం 'అమరన్' అనే సినిమా చేస్తున్న ఈ హీరో ఇప్పుడు మూడోసారి తండ్రి కాబోతున్నాడట.

publive-image

Also Read : బ్రేకప్ చేసుకున్న బాలీవుడ్ స్టార్ జంట.. కారణం అదేనా?

ముచ్చటగా మూడోసారి..

శివ కార్తికేయన్ 2010 లో తన దగ్గరి బంధువైన ఆర్తి దాస్ ను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ఆరాధన, గగన్ దాస్ ఇద్దరు సంతానం. అప్పుడప్పుడు ఈ హీరో ఫ్యామిలీతో కలిసి సినిమా ఫంక్షన్స్ కి అటెండ్ అవుతుంటాడు. అయితే గత కొంతకాలంగా ఈ జంట మూడో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నారట.

publive-image

ఈ క్రమంలోనే తాజాగా ఓ అభిమాని త‌న కొడుకు పుట్టిన‌రోజు వేడుకకు శివకార్తికేయన్‌ను పిలవ‌గా.. శివకార్తికేయన్ ఆ వేడుకకు భార్యతో కలిసి వెళ్లారు. అందుకు సంబంధించి ఓ వీడియో బయటికి వచ్చింది. అయితే ఆ వీడియోలో ఆర్తికి కాస్త పొట్ట ఉన్నట్లుగా కనిపించింది.

publive-image

దీంతో అది బేబి బంప్ అయ్యి ఉండొచ్చని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శివ కార్తికేయన్ త్వరలోనే మూడోసారి తండ్రి కాబోతున్నదని నెట్టింట గుసగుసలాడుకుంటున్నారు. కాగా ఈ విషయంపై శివ కార్తికేయన్ నుంచి ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు