Vijay Devarakonda: పెళ్లి పై విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారో తెలుసా..?

విజయ్ దేవకొండ లేటెస్ట్ చిత్రం ఫామిలీ స్టార్ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ కోసం చెన్నై వెళ్ళింది చిత్ర బృందం. అక్కడ విజయ్ కి పెళ్లి గురించి ప్రశ్న ఎదురవగా.. తప్పకుండా పెళ్లి చేసుకుంటానని, తనకూ పిల్లలు కావాలని బదులిచ్చారు.

New Update
Vijay Devarakonda: పెళ్లి పై విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారో తెలుసా..?

Vijay Devarakonda: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ఫ్యామిలీ స్టార్. విజయ్ హీరోగా గీతా గోవిందంతో హిట్ కొట్టిన పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ తో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు చిత్ర బృందం. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కోసం తాజాగా చెన్నై వెళ్లారు. అక్కడ విజయ్ కి తన పెళ్ళికి సంబంధించిన ప్రశ్న ఎదురవగా .. ఆసక్తికరంగా బదులిచ్చారు.

Also Read: Ram Charan: గోవిందుడు అందరివాడలే.. ఓ అమ్మాయి కోసం రాంచరణ్‌ ఏం చేశాడో చెప్పిన మంచు మనోజ్‌!

publive-image

నాకు పిల్లలు కావాలి .. తప్పకుండా పెళ్లి చేసుకుంటాను

పెళ్లి గురించి ప్రశ్నించగా.. తాను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని.. తనకూ పిల్లలు కావాలనీ. కాకపోతే ఈ ఏడాది చేసుకోనని చెప్పుకొచ్చాడు. అంతే కాదు తాను చేసుకోబోయేది లవ్ మ్యారేజ్ అని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో విజయ్ - రష్మీక  గురించి చర్చ మొదలైంది. విజయ్, రష్మిక పెళ్లి చేసుకోవడం ఖాయం అంటూ మురిసిపోతున్నారు అభిమానులు. ఇది ఇలా ఉంటే ఇటీవలే 'ఫ్యామిలీ స్టార్' హిట్ కావడం ఖాయం.. ఆల్ ది బెస్ట్ డార్లింగ్స్ విజయ్, పరుశురామ్ అని ట్వీట్ చేసింది రష్మిక. అలాగే తనకు పార్టీ కావాలని కూడా అడిగింది. దీనికి విజయ్ క్యూటెస్ట్ అంటూ హార్ట్ సింబల్ తో రిప్లై ఇచ్చారు.

publive-image

ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజ్, శిరీష్ నిర్మించారు. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో విడుదల కానుంది. గీత గోవిందం మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందరే ఈ మూవీకి కూడా సంగీతం అందించారు.

Also Read: Ariyana Glory: అరియానా గ్లోరీ సూసైడ్ వీడియో.. షాక్‌లో నెటిజన్లు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు