ap adulterated milk: ప్రకాశం జిల్లాలో కల్తీ పాల కలకలం..నూనె, ఉప్పుతో పాల తయారీ

ప్రకాశం జిల్లా దర్శిలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కల్తీ పాల తయారీ యూనిట్‌పై దాడి చేసి భారీగా కల్తీ పాలను పట్టుకున్నారు. దర్శిలోని గాంధీనగర్‌లో పుల్లారెడ్డి మిల్క్ సెంటర్‌లో కల్తీ పాలు తయారు చేస్తుండగా విజిలెన్స్ ఏఎస్పీ హర్షవర్ధన్ పట్టుకున్నారు.

New Update
ap adulterated milk: ప్రకాశం జిల్లాలో కల్తీ పాల కలకలం..నూనె, ఉప్పుతో పాల తయారీ

ప్రకాశం జిల్లా (Prakasam District) దర్శి (Darshi)లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కల్తీ పాల (adulterated milk) తయారీ యూనిట్‌పై దాడి చేసి భారీగా కల్తీ పాలను పట్టుకున్నారు. దర్శి పట్టణంలోని గాంధీనగర్‌ (Gandhi Nagar)లో పుల్లారెడ్డి మిల్క్ సెంటర్‌లో కల్తీ పాలు తయారు చేస్తుండగా విజిలెన్స్ ఏఎస్పీ హర్షవర్ధన్ పట్టుకున్నారు. గత కొద్దిరోజలుగా కల్తీ పాలను తయారు చేసి వాటిని దర్శిలోని కొన్ని డైరీలకు పంపుతున్నాట్టు అధికారులు తెలిపారు. దర్శి పట్టణంలోని కొన్ని ఆవుల ఫారం నుంచి పాలను సేకరించి వాటిలో శాతం పెంచేందుకు నూనె, ఉప్పు (Oil, salt)తో తయారు చేసిన మిశ్రమంను తయారు చేసి వారు సేకరించిన పాలలో కలపటం వలన పాలలో శాతం పెరుతుంది.

ఎక్కువ శాతం ఉండటం వలన ఎక్కువ డబ్బులు వస్తాయని.. కల్తీ రాయులు ఈ మార్గంను ఎంచుకున్నారు. ఇలా రోజుకు ఉదయం, సాయంత్రం ఐదువేల లీటర్ల కల్తీ పాలను తయారు చేస్తున్నాట్టు అధికారులు గుర్తించారు. కల్తీ పాలకు ఉపయోగించే నూనెను, ఉప్పును, మిశ్రమాన్ని సీజ్ చేశారు. అధికారులు వాటి శంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపుతామని తెలిపారు. విజిలెన్స్ అధికరులు (Vigilance Officers)  ఏఎస్పీ హర్షవర్ధన్,సీఐ రాఘవరావు నేతృత్వంలోనీ సిబ్బంది ఈ కల్తీ పాల తయారీని యూనిట్‌ను పట్టుకున్నారు.

ఇది కూడా చదవండి: మంథనిలో బీఆర్ఎస్‌కు షాక్… చల్లా నారాయణరెడ్డి పార్టీకి రాజీనామా

కల్తీ పాలు (adulterated milk)తయారు చేస్తున్న వెంకట్‌రమణ, మోహన్‌ అనే యాజమానులపై కేసు నమోదు (case Registration )  చేశామని అధికారులు తెలిపారు. ఈ కల్తీ పాలు తాగడం వల్ల పిల్లలకి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. కల్తీ పాలను ల్యాబ్‌ కూడా పంపించామని తెలిపారు. చట్ట ప్రకారం ఏమైనా చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని ఏఎస్పీ హర్షవర్ధన్తె (ASP Harshavardhan)లిపారు

ఇది కూడా చదవండి: కుప్పంను బెంబేలెత్తిస్తున్న చెడ్డీగ్యాంగ్.. హడలిపోతున్న నగర వాసులు

Advertisment
Advertisment
తాజా కథనాలు