/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-1-1-jpg.webp)
పండుగ వేళ రాష్ట్ర పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ గుండెపోటుతో మంగళవారం కన్నుముశారు. ప్రస్తుతం ఆయన విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా కొనసాగుతున్నారు. ఉదయం ఆయనకు ఒక్కసారిగా ఛాతినొప్పి రావడంతో.. కుటుంబ సభ్యులు ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మంగళవారం మృతి చెందారు. రాజీవ్ రతన్ మృతిపట్ల పలువురు సంతాపం తెలిపి.. రాష్ట్రానికి ఆయనకు చేసిన సేవలను స్మరించుకున్నారు. 1991వ బ్యాచ్‌కు చెందిన రాజీవ్ రతన్.. గతంలో కరీనంగర్ ఎస్పీగా పనిచేశారు. అలాగే ఆపరేషన్ ఐజీగా, తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా కూడా చేశారు.
Also read: నేటితో ముగియనున్న కవిత జ్యుడీషియల్ కస్టడీ.. మళ్లీ పొడగిస్తారా ?