వియాత్నాంలోని ప్రముఖ వ్యాపారవేత్త ట్రూంగ్ మై లాన్.. రూ.లక్ష కోట్లు మోసానికి పాల్పడినట్లు గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఇందుకు సంబంధించిన కేసులో దోషిగా తేలారు. దీంతో అక్కడి న్యాయస్థానం ఆమెకు మరణశిక్ష విధించింది. 'వాన్ థిన్ ఫాట్' అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఛైర్మన్‌గా ఉన్న ట్రూంగ్ మై లాన్.. దాదాపు 12.5 బిలియన్ డాలర్లు (రూ.లక్ష కోట్లు) బ్యాంకుల నుంచి మోసం చేసినట్లు కొంతకాలం క్రితం ఆరోపణలు వచ్చాయి. దీనిపై కోర్టులో విచారణ జరగగా.. చివరిగా ఆమెకు న్యాయస్థానం దోషిగా తేల్చింది.
Also Read: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని మోదీ జైలుకే..
దేశ సంపన్నుల్లో ఒకరైన ట్రూంగ్ మై లాన్ కోర్టు కేసు తీర్పుపై వియాత్నం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ట్రూంగ్ మై లాన్‌కు స్థానిక సైగాన్ కమర్షియల్ బ్యాంకులో ఏకంగా 90 శాతం వాటా ఉంది. గత కొన్నేళ్ల నుంచి ట్రూంగ్.. ఈ బ్యాంకులో మోసాలకు పాల్పడుతూ వస్తున్నారు. 2018 నుంచి 2022 మధ్య వ్యవధిలో.. 916 నకిలీ దరఖాస్తులు సృష్టించి బ్యాంకు నుంచి 304 ట్రిలియన్ డాంగ్ ( వియాత్నాం కరెన్సీలు) అంటే మన కరెన్సీలో రూ.లక్ష కోట్లకు పైగా తీసుకున్నట్లు అధికారులు దర్యాప్తులో తేల్చారు.
2019 నుంచి 2022 మధ్య ఆమె డ్రైవర్.. బ్యాంకు హెడ్‌క్వార్టర్స్ నుంచి 4.4 బిలియన్ డాలర్ల నగదును ట్రూంగ్ మై లాన్ ఇంటికి తరలించినట్లు అధికారులు గుర్తించారు. వాస్తవానికి 2022లోనే ఈ కుంభకోణం బయటపెడింది. అప్పుడే ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటివరకు ఈ కేసుపై విచారణ జరుగుతూనే ఉంది. అయితే ఈ కుంభకోణంలో ఆమె దోషిగా తెలడంతో.. తాజాగా కోర్టు ఆమెకు మరణశిక్ష విధించడం చర్చనీయాంశమవుతోంది.
Also Read: ఇజ్రాయెల్ కు 6వేల మంది భారత కార్మికులు..ఎందుకీ తొందరపాటు నిర్ణయం?