కేక్‌ తింటే క్యాన్సర్.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఫుడ్ కార్పోరేషన్

బేకరీలో దొరికే కేక్‌లు తినడం వల్ల క్యాన్సర్ బారిన పడతారని కర్ణాటక ఫుడ్ కార్పోరేషన్ వెల్లడించింది. బెంగళూరులోని బేకరీలో 235 కేక్ శాంపిల్స్ తీసుకుని పరీక్షలు నిర్వహించగా 12 కేకు శాంపిల్స్‌లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని గుర్తించింది.

cake
New Update

బేకరీలో లభించే కేక్‌లను అందరూ ఇష్టం తింటారు. అయితే ఈ కేక్‌లు ఆరోగ్యానికి మంచిది కాదని.. ఇందులో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని కర్ణాటక ఫుడ్ కార్పోరేషన్ వెల్లడించింది. గతంలో కాటన్ క్యాండీ, గోబీ మంచూరియాలో కూడా శరీరానికి హాని చేసే కారకాలు ఉన్నాయని గుర్తించింది. రాష్ట్రంలో ఈ పదార్థాలపై నిషేధం కూడా విధించింది. తాజాగా మళ్లీ బేకరీలోని కేక్‌లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు గుర్తించింది. 

ఇది కూడా చూడండి: మాతో పెట్టుకుంటే విధ్వంసం తప్పదు.. కిమ్ అణ్వాయుధాలు హెచ్చరిక

రెడె వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్

బెంగళూరులో వివిధ బేకరీల నుంచి మొత్తం 235 శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు. వీటిని ల్యాబ్స్‌లో పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 12 కేకు శాంపిల్స్‌లో క్యాన్సర్ కారక పదార్థాలను అధికారులు గుర్తించారు. ప్రజలు ఎక్కువ ఇష్టంగా తినే రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ వంటి కేకుల్లో హానికరమైన రసాయనాలు ఉన్నాయని కర్ణాటక ఫుడ్ కార్పోరేషన్ తాజాగా వెల్లడించింది. 

ఇది కూడా చూడండి:  నేడు గాయత్రీ అవతారంలో దుర్గమ్మ.. ప్రత్యేకత ఇదే!

ఆహార పదార్థాల్లో నాణ్యత లేకుండా, శుభ్రమైన ప్రదేశాల్లో వీటిని తయారు చేయరు. ఇలాంటి కేక్‌లను తినడం వల్ల ప్రమాదకర వ్యాధుల బారిన పడతారని ఫుడ్ కార్పోరేషన్ వెల్లడించింది. కేక్‌లు అందంగా కనిపించడానికి వీటిలో ఎక్కువగా ఫుడ్‌ కలర్స్ వాడుతారు. ఈ ఫుడ్ కల్సర్‌లో ఉండే హానికరమైన రసాయనాలు వల్ల శారీరక సమస్యలు రావడంతో పాటు మానసిక సమస్యల బారిన కూడా పడతారని కర్ణాటక ఫుడ్ సేఫ్ట అధికారులు తెలిపారు.  

ఇది కూడా చూడండి: ప్రతిరోజూ షేవ్ చేయడం ప్రమాదకరమా? చేస్తే ఏమవుతుంది.?

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe