Pistachios: మంచిదని పిస్తా తింటున్నారా? జర భద్రం.. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే. కానీ అతిగా తింటే అనారోగ్యంపాలుకూడా చేస్తాయట. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పిస్తా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాలకోసం ఆర్టికల్ చదివేయండి. By srinivas 05 Nov 2024 in Food Latest News In Telugu New Update షేర్ చేయండి Pistachios: ప్రస్తుతం ఆరోగ్యంపై అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత డ్రై ఫ్రూట్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటున్నవారి సంఖ్య రోజు రోజుకు అధికమవుతోంది. వీటిలో పిస్తా కూడా ఒకటి. పిస్తాలో మెగ్నిషియం, కాపర్, జింక్, ఫైబర్, కాల్షియం, పొటాషియం, విటమిన్ బీ6, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చాలామంది ప్రతిరోజు తింటున్నారు. కానీ వీటి వల్ల ప్రతికూల ప్రభావాలు కూడా ఉంటాయట. వారు కూడా పిస్తాకు దూరంగా ఉంటే మంచిది.. అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పిస్తా.. కొందరికి తీవ్ర అనారోగ్య సమస్యలను తెచ్చి పెడతాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో వేడి, కిడ్నీ సమస్యలు, బరువు తగ్గాలనుకునే వారు, జీర్ణ సమస్యలు, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు పిస్తాకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంకా షుగర్, బీపీ, గుండె సమస్యల మెడిసిన్స్‌ను ఉపయోగించే వారు కూడా పిస్తాకు దూరంగా ఉంటే మంచిదని హెచ్చరిస్తున్నారు. #health-tips #pistachio మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి