/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-47-1.jpg)
Video Glimpse From Sree Vishnu's Swag : టాలీవుడ్ లో రీసెంట్ గా సామజవరగమన, ఓం భీం బుష్ వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న శ్రీవిష్ణు.. త్వరలోనే ‘స్వాగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీవిష్ణు నటించిన ‘రాజ రాజ చోర’ మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాని హసిత్ గోలి డైరెక్ట్ చేస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ కథానాయికగా నటిస్తుండగా.. మలయాళ సీనియర్ నటి మీరా జాస్మిన్ కీలక పాత్రలో కనిపించనుంది. ఇటీవలే ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. తాజాగా రేజర్ అంటూ శ్రీవిష్ణు ఇంట్రో వీడియోను రిలీజ్ చేశారు.
Also Read : యూట్యూబ్ ను మడతపెట్టేసిన ‘గుంటూరు కారం’ సాంగ్.. నెట్టింట సెన్షేషనల్ రికార్డ్!
డిఫరెంట్ అవతార్ లో శ్రీవిష్ణు
తాజాగా రిలీజ్ చేసిన రేజర్ ఇంట్రో వీడియో ఆద్యంతం ఆకట్టుకోవడంతో పాటూ సినిమాపై మరింత ఆసక్తి పెంచింది. ‘మగవాడంటే మీకేం గుర్తొస్తుంది’ అంటూ ముసలివాడి క్యారెక్టర్‌లో ఉన్న శ్రీవిష్ణు చెప్పే డైలాగ్‌తో ‘రేజర్’ టీజర్ మొదలవుతుంది. ‘వేలెడంత పొగరు, వంశాన్ని, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేవాడు’ అని చెప్పగానే ఒక విచిత్రమైన నవ్వుతో శ్రీ విష్ణు ఫేస్ రివీల్ అవుతుంది.
‘తాగుదామా ఇంకా’ అనే డైలాగ్‌తో శ్రీ విష్ణు స్వాగ్‌ను చూపించాడు దర్శకుడు హసిత్ గోలి. ఇక ఈ వీడియో చూస్తుంటే పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రానున్నట్లు అర్థమవుతుంది. మొత్తంగా స్వాగ్ తో ఒక డిఫెరెంట్ శ్రీవిష్ణును చూడబోతన్నట్లు ఈ వీడియో ద్వారా చెప్పేశారు మేకర్స్. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూలై ఫస్ట్ వీక్ లోఆడియన్స్ ముందుకు రానుంది.
"Bhavabhuthi - The Face of the Male Pride" 🤟🧐
వంశాలైన, ఆస్తులైన, ఆడవాళ్ళైనా,
మగవాడినే అనుసరించాలి.Here's #RAZOR🤟https://t.co/XDS1vgTYhP
TEASER ARRIVING 🔊
Get ready to witness the #SWAG steep 🔝SPERMING SOON.. 🤟#అచ్చతెలుగుసినిమా @hasithgoli @peoplemediafcy… pic.twitter.com/F921VYb3eg
— Sree Vishnu (@sreevishnuoffl) June 14, 2024