Kurchi Madathapetti : యూట్యూబ్ ను మడతపెట్టేసిన 'గుంటూరు కారం' సాంగ్.. నెట్టింట సెన్షేషనల్ రికార్డ్!

'గుంటూరు కారం' సినిమాలో 'కుర్చీ మడత పెట్టి' అనే పాట ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో ఓ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో 300 మిలియన్లకు పైగా వ్యూస్‌ అందుకున్న సాంగ్ గా అరుదైన ఘనత సాధించింది.

New Update
Kurchi Madathapetti : యూట్యూబ్ ను మడతపెట్టేసిన 'గుంటూరు కారం' సాంగ్.. నెట్టింట సెన్షేషనల్ రికార్డ్!

Guntur Kaaram Kurchi Madathapetti Song Rare Feet : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన 'గుంటూరు కారం' మూవీ ఈ ఏడాది సంక్రాతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తమన్ (Thaman S) ఈ సినిమా కోసం కంపోజ్ చేసిన సాంగ్స్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా సినిమాలో 'కుర్చీ మడత పెట్టి' అనే పాట ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించడమే కాకుండా సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో బాగా ట్రెండ్ అయింది. ఇప్పటికీ ఎక్కడో చోట ఈ సాంగ్ వినిపిస్తూనే ఉంటుంది. ఇక తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో ఓ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో 300 మిలియన్లకు పైగా వ్యూస్‌ అందుకున్న సాంగ్ గా అరుదైన ఘనత సాధించింది.

Also Read : ఫ్యాన్స్ కి బిగ్ షాక్ ఇచ్చిన ‘పుష్ప’!

సాంగ్ రిలీజైన డే వన్ నుంచి నేటి వరకు యూట్యూబ్‌, ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్.. ఇలా సోషల్ మీడియాలో ఉన్న అన్ని ప్లాట్ ఫామ్స్ లో మిలియన్స్ కొద్దీ రీల్స్ చేసారంటే.. ఈ సాంగ్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కుర్చీ మడతపెట్టి సాంగ్ యూట్యూబ్ లో రేర్ ఫీట్ అందుకోవడంతో ఈ విషయం తెలిసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Kurchi Madathapetti Song

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు