Venkatesh : బ్యాక్ టూ యాక్షన్.. అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన వెంకీ మామ, వీడియో వైరల్!

వెంకటేష్ - అనిల్ రావిపూడి మరోసారి కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్ లో వెంకటేష్ జాయిన్ అయ్యారు. ఈ మేరకు మూవీ టీమ్ షూటింగ్‌ లొకేషన్‌లో తీసిన విజువల్స్‌కు సంబంధించిన వీడియోను మేకర్స్‌ షేర్ చేశారు. ఇందులో వెంకటేష్ న్యూ లుక్ ఆకట్టుకుంది.

Venkatesh : బ్యాక్ టూ యాక్షన్.. అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన వెంకీ మామ, వీడియో వైరల్!
New Update

Venky Anil 3 Movie : ఎఫ్2, ఎఫ్3 వంటి హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి మరోసారి కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. #Anil Venky 3 అనే వర్కింగ్ టైటిల్ తో రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరణ మొదలైంది. ఇక తాజాగా ఈ మూవీ షూటింగ్ లో వెంకటేష్ జాయిన్ అయ్యారు.

ఈ మేరకు మూవీ టీమ్ షూటింగ్‌ లొకేషన్‌లో తీసిన విజువల్స్‌కు సంబంధించిన వీడియోను మేకర్స్‌ షేర్ చేశారు.' మాజీ పోలీసాఫీసర్‌ ఫుల్ ఎనర్జీతో మళ్లీ డ్యూటీని మొదలుపెట్టాడు. వెంకీమామ SVC58 సెట్స్‌లో జాయిన్‌ అయ్యాడు. ఈ ట్రయాంగులర్‌ క్రైం ఎంటర్‌టైనర్‌ షూటింగ్‌ పొల్లాచ్చిలో జెడ్‌స్పీడ్‌లో కొనసాగుతుందంటూ' అనిల్ రావిపూడి టీం పేర్కొంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : బిగ్ బాస్ హోస్ట్ గా విజయ్ సేతుపతి..

ఈ మేకింగ్ వీడియో కాస్త సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దిల్ రాజు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది.

#venky-anil-3-movie #victory-venkatesh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe