Deep Fake : 'ఏఐ'తో అడ్డగోలు పనులు.. ఫొటోలకు బట్టలు తీసేస్తున్న పోకిరిగాళ్లు..!

డీప్‌ఫేక్ పోర్నోగ్రఫీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఫొటోలను 'ఏఐ' ద్వారా 'అన్‌డ్రెస్‌' చేసే వెబ్‌సైట్లలో పోకిరిగాళ్లు హద్దుదాటుతున్నారు. గత సెప్టెంబర్‌లో 2 కోట్ల 40లక్షల మంది యూజర్లు 'న్యూడిఫై' సైట్లను విజిట్‌ చేశారని నివేదికలు చెబుతున్నాయి.

New Update
Deep Fake : 'ఏఐ'తో అడ్డగోలు పనులు.. ఫొటోలకు బట్టలు తీసేస్తున్న పోకిరిగాళ్లు..!

Bloomberg : 'ఛీ.. ఛీ' అసలు ఇలా తయారవుతున్నారేంటి..? సోషల్‌మీడియాలో మన ఫొటోలు పెట్టుకోవడమే పాపం ఐపోయింది. సోషల్‌మీడియాలోనే కాదు.. అసలు నెట్టింట్లో ఎక్కడా కూడా ఫొటోలకు రక్షణ లేదు. టెక్నాలజీ ముసుగులో అడ్డదిడ్డమైన పనులు చేసే పోకిరిగాళ్ల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ఎవరివో న్యూడ్‌ ఫొటోలకు ఎవరివో తెలియని అమ్మాయిల ఫొటోలను మార్ఫ్‌ చేసే కాలం దాటిపోయింది. డీప్‌ ఫేక్‌ అంటూ కొద్దీ కాలంగా వీడియోలు హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. సినీతారలకు ఈ సెగ ఇప్పటికే తాగలగా.. సామాన్య మహిళలకు కూడా ఇవి తప్పడం లేదు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI)మాయలో ఓవైపు టెక్కిలు తమ పని తాము చేసుకుపోతుంటే.. నేరగాళ్లు, కామాంధులు ఈ టెక్నాలజీని వాడుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. నెట్‌లో దొరికిన అమ్మాయి ఫొటోలకు అమ్మాయిలను గ్రాబ్‌ చేసి వారికి బట్టలే లేకుండా ఉంటే ఎలా ఉంటారో చూడాలంటూ 'ఏఐ' సంబంధింత అన్‌డ్రెసెడ్‌ సైట్లను, యాప్స్‌ను వాడుకుంటున్నారు. ఇది ప్రముఖ మీడియా సంస్థ బ్లూమ్‌బర్గ్‌(Bloomberg) చెబుతున్న సంచలన నిజాలు.

publive-image ప్రతీకాత్మక చిత్రం

నెలలో ఎన్నికోట్ల మంది సైట్‌కు వచ్చారో తెలుసా?
సోషల్ నెట్‌వర్క్ విశ్లేషణ సంస్థ 'గ్రాఫికా(Graphika)' సంచలన విషయాలను బయటపెట్టింది. 'అన్‌డ్రెసెడ్‌' సైట్ల తాకిడి ఏ రేంజ్‌లో ఉందో లెక్కలతో సహా చెప్పింది. గత సెప్టెంబరులోదాదాపు 2 కోట్ల 40 లక్షల మంది యూజర్లు బట్టలు విప్పే(Undressed) వెబ్‌సైట్‌లను సందర్శించారని తెలిపింది. కృత్రిమ మేధస్సులో పురోగతిని ప్రజలు ఎలా మిస్‌యూజ్‌ చేసుకుంటున్నారో.. దీని వల్ల నెట్టింట్లో అశ్లీలత ఎలా పెరుగుతుంతో వివరించింది. ఈ సంస్థ విశ్లేషనను 'బ్లూమ్‌బెర్గ్' నివేదించింది.

publive-image ప్రతీకాత్మక చిత్రం

ట్విట్టర్‌, రెడ్డిట్‌ ఇంకా స్పందించలేదు:
న్యూడిఫై(nudify) పేరిట సోషల్‌మీడియాలో చాలా ప్రకటనలు కనిపిస్తున్నాయని చాలా కాలంగా ఫిర్యాదులు ఉన్నాయి. ఈ ఏడాది(2023) ప్రారంభం నుంచి ట్విట్టర్‌(X ), రెడిట్‌(Reddit) లాంటి ప్లాట్‌ఫారమ్‌లలో ప్రకటనల లింక్‌ల సంఖ్య 2,400 శాతం పైగా పెరిగింది. మహిళలపై దృష్టి సారిస్తూ, వ్యక్తులను డిజిటల్‌గా బట్టలు విప్పడానికి 'ఏఐ' సాంకేతికతను ఉపయోగిస్తారు. ఇది అనైతికం, చట్టరిత్య నేరం కూడా. ఫొటోలను ఎక్కువగా సోషల్‌మీడియా నుంచే తీసుకుంటారు. దీనికి సంబంధించిన యాడ్స్‌ను గూగుల్ ఇప్పటికే బ్యాన్‌ చేయగా.. అటు ట్విట్టర్‌.. ఇటు రెడిట్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. మరోవైపు ప్రముఖ సోషల్‌మీడియా సంస్థ మెటా ఈ న్యూడిఫై యాడ్స్‌ను బ్లాక్‌ చేస్తోంది. Undress(అన్‌డ్రెస్‌) పదం ఎక్కడ కనిపించినా ఓ కన్నేసి ఉంచుతోంది.

కఠిన శిక్షలు ఉండాల్సిందే:
ఈ అన్‌డ్రెసెడ్‌ సైట్లను ఉపయోగించేవారు ఎక్కువగా అమెరికాలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నారు. దీన్ని డీప్‌ఫేక్ పోర్నోగ్రఫీ అని పిలుస్తారు. నార్త్ కరోలినాలో ఇటీవలి ఓ కేసు నమోదైంది. ఆస్పత్రిలో నిద్రపోతున్న రోగులను ఫోటోలు తీసి.. వాటిని బట్టలు విప్పే యాప్‌లను ఉపయోగించాడు ఓ డాక్టర్‌. అతనికి అక్కడి కోర్టు 40 సంవత్సరాల శిక్ష విధించింది.

Also Read: రయ్.. రయ్.. మహిళలందరికీ ఫ్రీ బస్సు సర్వీస్ స్టార్ట్.. జీరో టికెట్ ఎలా ఉందో చూడండి!

WATCH:

Advertisment
తాజా కథనాలు