/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/venky-1-jpg.webp)
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) మంచి జోరు మీద ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా ఆయన నటించిన చిత్రం సైంధవ్.(Saindhav) ఇందులో ఆయన టైటిల్ రోల్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది.
విడుదలకు ఇంకా ఎన్నో రోజులు సమయం లేకపోవడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీగా మారింది. ఈ క్రమంలోనే ఈరోజు వెంకీ, శైలేష్ కొలను విజయవాడ, గుంటూరు పట్టణాల్లో సెకండ్ సింగిల్ లాంఛ్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు వీవీఐటీ కాలేజీలో, సాయంత్రం 5 గంటలకు కేఎల్‌యూలో స్టూడెంట్స్ మధ్య సాంగ్ ను లాంఛ్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే చిత్ర బృందం విజయవాడకు చేరుకుంది. ముందుగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ బస్ లో వెంకీ, శైలేష్ తో పాటు చిత్ర బృందం ఉన్న స్టిల్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటికే సెకండ్ సింగిల్ ఫస్ట్ లుక్ లోసైంధవ్ క్యూట్ ఫ్యామిలీతో ఉన్న స్టిల్ నెట్టిం వైరల్ అవుతోంది.
చిత్ర బృందం ఇటీవలే లాంఛ్ చేసిన సైంధవ్ ఫస్ట్ సింగిల్ మ్యూజిక్ అందర్ని ఆకట్టుకుంది. చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్ డ్రాప్ మిషన్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో వెంకటేష్ కి జోడిగా శ్రద్దా శ్రీనాథ్ నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ , ఆండ్రియా జెర్మియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే మూవీ మేకర్స్ దీనికి సంబంధించిన వీడియో షేర్ చేయగా..అది నెట్టింట హల్‌చల్ చేస్తోంది.సైంధవ్ మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి తెరకెక్కిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
Team #SAINDHAV kicks off to Vijayawada for a spree of events today 💥
— BA Raju's Team (@baraju_SuperHit) December 11, 2023
Get ready to shower all your Love ❤️#SaindhavOnJAN13th
Victory @VenkyMama #SsaraPalekar @Nawazuddin_S @arya_offl @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @NiharikaEnt… pic.twitter.com/7sdiDvB0p8
Also read: రోడ్డుపై ఊర కుక్కలాగా అరవద్దు.. ఇలాంటివాళ్లతో చాలా డేంజర్ బాబోయ్!