Venkatesh Daughter : హీరో వెంకటేష్ దగ్గుబాటి(Venkatesh Daggubati) చిన్న కూతురు పెళ్లి వేడుకలు ఇటీవలే కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగాయి. విజయవాడ(Vijayawada) కు చెందిన డాక్టర్ నిశాంత్ పాతురితో ఈమె ఏడడుగులు వేశారు. హైదరాబాద్(Hyderabad) రామానాయుడు స్థూడియోస్(Ramanaidu Studios) వీరి వివాహ వేడుకలను నిర్వహించారు. టాలీవుడ్(Tollywood) స్టార్ హీరోగా పేరున్న వెంకటేష్ తన కూతురు పెళ్లి చాలా సింపుల్ గా, కేవలం అతి కొద్దీ మంది స్నేహితులు, బందుమిత్రుల మధ్యనే జరిపించడం అందరూ ఆశ్చర్యపడేలా చేసింది.
Also Read : Actress Anjali : విడాకులు తీసుకున్న నిర్మాతతో.. హీరోయిన్ అంజలి పెళ్లి?
సింపుల్ గా శ్రీవారిని దర్శించుకున్న హీరో వెంకటేష్ కూతురు
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ జంట తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో కూడా ఎలాంటి హడావిడీ, ఆర్భాటాలు లేకుండా ఒక సామాన్య వ్యక్తుల వలే వీరిద్దరూ కనిపించడం మళ్ళీ ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా సెలెబ్రెటీలు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలాంటి దేవస్థానాలును దర్శించుకున్నప్పుడు వీఐపీ దర్శనం, సెక్యూరిటీ అంటూ చాలా హడావిడి ఉంటుంది. కానీ వెంకటేష్ చిన్న కూతురు, అల్లుడు మాత్రం ఇలా సింపుల్ గా కనిపించడం అందరి చూపును ఆకర్షిస్తుంది. వీళ్లదరి సింప్లిసిటీని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు "వావ్ సో సింపుల్"(Wow So Simple), అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read : Ketika Sharma: బీచ్ అందాలతో పోటీపడుతున్న హాట్ బ్యూటీ కేతిక.. వైరలవుతున్న ఫొటోలు..!