Vegetable Prices: కూరగాయల ధరలు పైపైకి..వారంలో 30 నుంచి 60 శాతం పెరుగుదల!

కూరగాయల ధరలు రోజురోజుకి క్రమక్రమంగా ఆకాశనంటుతున్నాయి. కేవలం 2-3 వారాల వ్యవధిలోనే ఏకంగా 30 నుంచి 60 శాతం మేర పెరిగాయి. దీంతో సామాన్యులు కూరగాయలు కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు.

New Update
Vegetable Prices: కూరగాయల ధరలు పైపైకి..వారంలో 30 నుంచి 60 శాతం పెరుగుదల!

Vegetable Prices: కూరగాయల ధరలు రోజురోజుకి క్రమక్రమంగా ఆకాశనంటుతున్నాయి. కేవలం 2-3 వారాల వ్యవధిలోనే ఏకంగా 30 నుంచి 60 శాతం మేర పెరిగాయి. దీంతో సామాన్యులు కూరగాయలు కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడం వల్లే కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కూరగాయల ఉత్పత్తి భారీగా తగ్గిపోగా.. డిమాండ్ పెరిగి ధరలు భగ్గుమంటున్నాయి.

రేట్లు పెరగడంతో సామాన్యులతో పాటు వ్యాపారులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వర్షాలతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవించగా.. కూరగాయలు త్వరగా కుళ్లిపోతుండడంతో వ్యాపారస్తులు దిగుమతులను క్రమంగా తగ్గించగా.. రాష్ట్రంలో కూరగాయల సాగు కూడా క్రమంగా తగ్గిపోయింది. వీటి ప్రభావంతో ప్రస్తుతం మార్కెట్‌లో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఈ పరిస్థితే ఉంది.

మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.40-50కి చేరగా.. టమాటా ధర రూ. 60-90గా ఉంది, వంకాయ రూ.40-50 పలుకుతుండగా.. పచ్చి మిర్చి రూ.80-120కి చేరుకోవడంతో .. మార్కెట్‌కు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక, బీన్స్, క్యారట్, బీట్రూట్, క్యాప్సికం, కాకరకాయ, పుదీనా, కొత్తిమీర ఇలా అన్నింటి ధరలు రెట్టింపు కావడంతో.. క్రమంగా వంట గదిలో కూరగాయాలు కనమరుగవుతున్నాయి.

Also read: రేపే సివిల్స్‌ ప్రిలిమ్స్‌!

Advertisment
తాజా కథనాలు