Vasireddy Padma: వైసీపీకి బిగ్‌ షాక్‌..ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ రాజీనామా!

ఏపీ మహిళా కమిషన్ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు.రాజీనామాను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ కు పంపించారు. పద్మ ఆగష్టు 2019 లో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.

Vasireddy Padma: వైసీపీకి బిగ్‌ షాక్‌..ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ రాజీనామా!
New Update

Vasireddy Padma Resign: ఏపీలో రాజకీయాలు ఏ క్షణాన ఎలా మారుతున్నాయో కూడా అర్థం కావడం లేదు. సీటు వస్తుందనుకున్నవారికి సీట్లు రాకపోవడంతో పార్టీలు మారిపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీలో (YCP) కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేపథ్యంలో వైసీపీ అధిష్టానానికి మరో పెద్ద షాక్‌ తగిలింది. ఏపీ మహిళా కమిషన్ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు.

రాజీనామాను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ కు (CM Jagan) పంపించారు. పద్మ ఆగష్టు 2019 లో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఆమె ముందు నన్నపనేని రాజకుమారి ఆ పదవికి రాజీనామా చేయడంతో.. అధికార వైసీపీ వాసిరెడ్డి పద్మకు రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

publive-image

ఇప్పుడూ ఎన్నికల ముందు వాసిరెడ్డి రాజీనామా చేయడంతో వైసీపీకి షాక్‌ తగిలినట్లు అయ్యింది. వాసిరెడ్డి ఇంతకు వైసీపీ కి అధికార ప్రతినిధిగా పని చేశారు. ఇప్పుడు వాసిరెడ్డి కేవలం పదవికి మాత్రమే రాజీనామా చేశారా? లేక పార్టీకి కూడా రాజీనామా చేశారా అనే దాని మీద సందేహలు వ్యక్తం అవుతున్నాయి.

ఆమె మరో పార్టీలో చేరుతారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. జగన్‌కు అత్యంత నమ్మకమైన నేతగా వాసిరెడ్డి పద్మ ఇన్నాళ్లు ఉన్నారు. గత కొంత కాలంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన పద్మ. కానీ ఆమెకు నిరాశ ఎదురైంది. మహిళా కోటాలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఆశపడ్డ పద్మ. మైలవరం, జగ్గయ్యపేటలో ఏదో ఒకచోట నుంచి..సీటు వస్తుందని ఆశించిన పద్మ. ఇక నుంచి పార్టీ కోసం పనిచేస్తానంటున్న వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.

Also read: లిక్కర్‌ స్కామ్‌ కేసులో కేజ్రీవాల్‌ కు కోర్టు షాక్‌!

#ycp #ap-politics #mahila-commisssion #vasireddy-padma
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe