Vasantha Krishna Prasad: మైలవరంలో దేవినేని ఉమాకు షాక్..వసంతకు అక్కడ నుంచే టీడీపీ టికెట్? వసంత త్వరలోనే సైకిల్ ఎక్కబోతున్నట్లు ఆయన వర్గీయులు తెలిపారు. వసంతకు మైలవరం నుంచి టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. మైలవరం టికెట్ వసంతకు ఇవ్వడంతో దేవినేని ఉమా వర్గీయులు భగ్గుమంటున్నారు. By Bhavana 05 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Vasantha -Tdp: ఏపీ రాజకీయాలు (Ap Politics) కొత్త కొత్త మలుపులు తిరుగుతన్నాయి. అధికార పక్షం సీటు ఇస్తుందని ఆశపడి భంగపడిన నేతలు చాలా మంది పార్టీని వీడి పక్క పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్(Vasantha Krishna Prasad) గత కొంత కాలం నుంచి కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ సమయంలోనే ఈ సారి అధిష్ఠానం ఆయనకు టికెట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఆయన పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. వసంత త్వరలోనే సైకిల్ ఎక్కబోతున్నట్లు ఆయన వర్గీయులు తెలిపారు. వసంతకు మైలవరం నుంచి టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఇదిలా ఉంటే మైలవరంలో టీడీపీ జెండాను ఎగరవేసేది దేవినేని ఉమా(Devineni Uma) . ఇప్పుడు ఉమాను కాదు అని ఆ సీటు వసంతకు ఇవ్వడం పై ఉమా వర్గం భగ్గుమంటుంది. టీడీపీ తరుఫున మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ పై దేవినేని ఉమా పరోక్షంగా చాలా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మైలవరం నుంచే దేవినేని కూడా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. వసంత కానీ, దేవినేని కానీ ముందు నుంచే రాజకీయ ప్రత్యర్థులు. ఇప్పుడు వసంత టీడీపీకి రావడంతో దేవినేనిని పెనమలూరుకు పంపేందుకు అధిష్ఠానం యోచిస్తుంది. అయితే దేవినేని మాత్రం ఇష్టపడడం లేదు. మరి ఈ సమస్యను చంద్రబాబు ఈ సమస్యను ఎలా పరిష్కారిస్తారనేది చూడాల్సిందే. Also read: వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లలో ఏఐ ఫీచర్… ఇక నుంచి మీ పని క్షణాల్లో పూర్తి! #ycp #tdp #devineni-uma #mylavaram #vasanta-krishna-prasad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి