Operation Valentine : 'ఆపరేషన్ వాలెంటైన్' మరో సారి వాయిదా.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్

మెగా హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. గతేడాది డిసెంబర్ 8న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఈ ఫిబ్రవరి 16కు వాయిదా పడగా.. తాజాగా మూవీ రిలీజ్‌ను మరోసారి పోస్ట్ పోన్‌ చేశారు మేకర్స్. మార్చ్ 1న విడుదల అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు.

New Update
Operation Valentine : 'ఆపరేషన్ వాలెంటైన్' మరో సారి వాయిదా.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్

Operation Valentine : మెగా హీరో ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine) సినిమా చేస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్(Indian Air Force) బ్యాక్ డ్రాప్ లో హిస్టారికల్ యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్ బ్యానర్(Sony Pictures Banner) పై సందీప్ ముద్ద నిర్మిస్తున్నారు. మాజీ మిస్ యూనివర్స్ మానుషీ చిల్లర కథానాయికగా నటిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 8న విడుదల కావాల్సింది కానీ.. 2024 ఫిబ్రవరి 16 కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ తేదీకి కూడా ఆపరేషన్ వాలెంటైన్ రిలీజ్ కావడం లేదు.

ఆపరేషన్ వాలెంటైన్ మరో సారి పోస్టుపోన్

తాజాగా మేకర్స్ ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు. మరో సారి పోస్టుపోన్ అయిన ఈ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే కావడంతో రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. యాడ్ ఫిల్మ్‌ మేకర్‌, సినిమాటోగ్రఫర్‌, శక్తికాంత్ డైరెక్ట్ చేస్తున్న మొదటి సినిమా కావడం, వరుణ్ హిందీ డెబ్యూ కూడా ఇదే కావడంతో సినిమా పై మరింత ఆసక్తి పెరిగింది.

యాదార్థ సంఘటనల స్పూర్తితో.. తెలుగు, హిందీ బై లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్ కు ప్రేక్షకులలో మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన ఈ టీజర్ 20 మిలియన్ పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో వరుణ్- పైలెట్ రుద్రదేవ్, మానుషీ చిల్లర-రాడార్ ఆఫీసర్ సోనాల్, నవదీప్ - వింగ్ కమాండర్ కబీర్ పాత్రల్లో కనిపించనున్నారు.

publive-image

ఆపరేషన్ వాలెంటైన్ తో పాటు వరుణ్ తేజ్(Varun Tej) నటిస్తున్న మరో లేటెస్ట్ చిత్రం మట్కా. కరుణకుమార్ దర్శకత్వంలో మాఫియా బ్యాక్ డ్రాప్ లో యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో వరుణ్ తేజ్ లుక్, డ్రెస్సింగ్ స్టైల్ డిఫరెంట్ గా కనిపించాయి. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది. వైరా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తుంది.

Also Read : Saindhav OTT Release : వెంకటేష్ సైంధ‌వ్ ఓటీటీ రిలీజ్.. అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

#operation-valentine-movie #varun-tej #operation-valentine-release
Advertisment
Advertisment
తాజా కథనాలు