/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/varun-1-1-jpg.webp)
Varun Tej and Lavanya Tripathi Pre Wedding: హీరో వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిల పెళ్లి.. అటు మెగా ఫ్యామిలీలోనూ.. ఇటు అల్లు ఫ్యామిలీలోనూ సంబరాలు అంబరానంటుతున్నాయి. జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ ప్రేమజంట వచ్చే నెల నవంబర్ 1న వివాహ బంధంతో ఒక్కటికానుంది. ఇటలీలోని టస్కానీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు మెగా కుటుంబం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది.
Thank you bunny and Sneha akka for hosting a wonderful evening for us!
Love you guys!♥️@alluarjun @AlluSirish @Itslavanya pic.twitter.com/xggJZs77XG— Varun Tej Konidela (@IAmVarunTej) October 16, 2023
Also Read: మార్గదర్శి కేసులో రామోజీరావుకు బిగ్ షాక్…కేసు నమోదు చేసిన సీఐడీ..!!
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కాబోయే దంపతుల కోసం ఓ పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ (Allu Arjun) దంపతులు కూడా వరుణ్, లావణ్య కోసం మరో ప్రీవెడ్డింగ్ పార్టీ ఇచ్చారు. అల్లు అర్జున్ ఇంట్లో ఆదివారం జరిగిన ఈ పార్టీ ధూమ్ ధామ్ గా జరిగింది. వరుణ్ తేజ్ - లావణ్య ప్రీ వెడ్డింగ్ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) , అల్లు శిరీష్, అల్లు అరవింద్, ఉపాసన, వైష్ణవ్ తేజ్‍తో పాటు వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ పార్టీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కేక్ కూడా కట్ చేశారు.
అల్లు అర్జున్ ఇంట్లో జరిగిన ప్రీవెడ్డింగ్ పార్టీకి సంబంధించి కొన్ని ఫొటోలను వరుణ్ తేజ్ (Varun tej) తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పార్టీ అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందంటూ కామెంట్ చేశారు. ‘థాంక్యూ బన్నీ, స్నేహ అక్కా’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. మరోవైపు పెళ్లి హాడావీడి ఉంటున్నప్పట్టికీ.. కాబోయే దంపతులకు ఇతర కుటుంబసభ్యులు వరుసగా ప్రీవెడ్డింగ్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే, బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఈ వేడుకకు హాజరు కాలేకపోయినట్లు తెలుస్తోంది. మెగా-అల్లు కుటుంబసభ్యులతో పాటూ హీరో నితిన్, ఆయన భార్య షాలిని, నటి రీతూ వర్మ కూడా పాల్గొని సందడి చేశారు.
Also Read: మెగా ఫ్యాన్స్ కు పండగే.. శంకర్ దాదా M.B.B.S. రీ రిలీజ్..!