Varun,Lavanya Marriage: ఇటలీలో వరుణ్ తేజ్ పెళ్లి ఫోటోలు..!
వరుణ్, లావణ్య పెళ్లి వేడుకలకు ఇటలీ చేరుకున్న మెగా ఫ్యామిలీ ప్రస్తుతం అక్కడ హాలిడేను ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
వరుణ్, లావణ్య పెళ్లి వేడుకలకు ఇటలీ చేరుకున్న మెగా ఫ్యామిలీ ప్రస్తుతం అక్కడ హాలిడేను ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
వరుణ్ తేజ్, లావణ్యల వివాహ వేడుకలకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దంపతులు ఇటలీకి బయలుదేరారు. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇప్పటికే రాంచరణ్ దంపతులతో పాటు నిహారిక ఇటలీ వెళ్లి సందడి ప్రారంభించిన సంగతి తెలిసిందే!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రి వెడ్డింగ్ పార్టీలో హీరోయిన్ రీతూ వర్మ ఎంత ఫోకస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లిచూపులు, టక్ జగదీష్ లాంటి మూవీలతో ఫేమస్ అయిన హీరోయిన్ రీతూ వర్మ. అయితే, ప్రస్తుతం ఆమె పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హీరోయిన్ రీతూ వర్మ మరో మెగా కోడలు అంటూ నెటిజన్స్ హల్ చల్ చేస్తున్నారు.
‘థాంక్యూ బన్నీ, స్నేహ అక్కా’ అంటూ మెగా హీరో వరుణ్ తేజ్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. హీరో వరుణ్ ఈ ఇద్దరికి మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు థ్యాంక్స్ చెప్పారో అని అనుకుంటున్నరా? .. రిసెంట్ గా అల్లు అర్జున్ దంపతులు కూడా వరుణ్, లావణ్య కోసం మరో ప్రీవెడ్డింగ్ పార్టీ ఇచ్చారు. సో అందుకోసం అల్లు అర్జున్ కు థాంక్స్ చెబుతూ పోస్ట్ చేశారు హీరో వరుణ్ తేజ్. ఈ పార్టీలో మెగా-అల్లు కుటుంబసభ్యులతో పాటూ హీరో నితిన్, ఆయన భార్య షాలిని, నటి రీతూ వర్మ వంటి ప్రముఖులు కూడా పాల్గొని సందడి చేశారు.