Varalakshmi Sarath kumar : అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన కోలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?

నటి వరలక్ష్మీ శరత్ కుమార్ త్వరలోనే పెళ్లి పీట‌లు ఎక్క‌బోతుంది. ముంబైకి చెందిన ఆర్ట్‌ గ్యాలరీల నిర్వాహకుడు నిచోలై సచ్‌దేవ్‌ని త్వరలోనే పెళ్లాడనుంది. తాజాగా అల్లు అర్జున్ ను పెళ్ళికి ఆహ్వానించేందుకు స్వయంగా ఇంటికి వెళ్ళింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update
Varalakshmi Sarath kumar : అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన కోలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?

Varalakshmi Sarathkumar Invites Allu Arjun :క్రాక్, వీరసింహారెడ్డి, యశోద వంటి సినిమాల్లో లేడీ విలన్ గా తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ త్వరలోనే పెళ్లి పీట‌లు ఎక్క‌బోతుంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్‌ గ్యాలరీల నిర్వాహకుడు నిచోలై సచ్‌దేవ్‌ని ఆమె త్వరలోనే పెళ్లాడనుంది. రీసెంట్ గా వీరిద్ద‌రూ గ్రాండ్ గా ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. జూలైలో వీరి వివాహం జ‌రుగ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఈ క్రమంలోనే వరలక్ష్మీ పెళ్ళికి సంబంధించి పనులు చక చకా జరుగుతున్నాయి. మరోవైపు వరలక్ష్మి ఇప్ప‌టికే త‌మిళ‌నాడులో ఉన్న పలువురు సినీ ప్ర‌ముఖులతో పాటు రాజ‌కీయ ప్ర‌ముఖులను తన పెళ్ళికి ఇన్వైట్ చేయగా.. తాజాగా మన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పెళ్ళికి ఆహ్వానించేందుకు స్వయంగా ఇంటికి వెళ్ళింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌తో పాటు అత‌ని తండ్రి అల్లు అర‌వింద్‌కు కూడా త‌న పెళ్లికి ర‌మ్మ‌ని ఆహ్వానించింది.

Also Read : ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ కాదు..! మరో బాలీవుడ్ స్టార్ హీరో..?

బన్నీకి వెడ్డింగ్ కార్డు ఇవ్వ‌డానికి వరలక్ష్మి ప్రియుడు నిచోలై సచ్‌దేవ్ కూడా ఆమెతో రావడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా వరలక్ష్మీ బన్నీ కంటే ముందు టాలీవుడ్ సెలెబ్రిటీలు అయిన.. ర‌వితేజ, ద‌ర్శ‌కుడు హరీష్ శంకర్, హనుమాన్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌, న‌టి సమంత, పైడిప‌ల్లి వంశీ, త‌మ‌న్, గోపిచంద్ మ‌లినేని తదితరులను పెళ్ళికి ఇన్వైట్ చేసింది.

Advertisment
తాజా కథనాలు