వందే భారత్ (Vandhe Bharat) లో ఎట్టకేలకు స్లీపర్ కోచ్ (Sleeper coach) లను ప్రవేశ పెట్టేందుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Aswini Vaishnav) వందే భారత్ స్లీపర్ కోచ్ చిత్రాను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ ఆధునాతన రైళ్లు మార్చి 2024 నుంచి అందుబాటులోకి వస్తాయని, ప్రయాణీకులకు ఆయన తెలిపారు.
ఈ రైలు కోచ్ లు ప్రయాణీకులకు వేగవంతమైన, అత్యాధునిక సౌకర్యవంతమైన ప్రయాణానుభూతిని పొందుతారని ఆయన వివరించారు.మంత్రి రిలీజ్ చేసిన చిత్రాల్లో వందే భారత్ స్లీపర్ కోచ్ లు విశాలంగా కనిపిస్తున్నాయి. ఆయన పంచుకున్న చిత్రాల్లో ఇంటీరియర్స్, విశాలమైన టాయిలెట్లు, చిన్న ప్యాంట్రీ తో అనేక సౌకర్యాలు కూడా ఉన్నాయి.
Also read:బ్రిడ్జి పై నుంచి కింద పడిన బస్సు..పిల్లలతో పాటు 21 మంది మృతి!
కొత్త రైళ్లు ప్రస్తుత కోచ్ ల కంటే ఎంతో సమర్థవంతమైనవి. ఇవి వందే భారత్ స్లీపర్ కోచ్ లను ప్రవేశ పెట్టడం భారతీయ రైల్వేలకు ఒక మంచి పరిణామం అని ఆయన పేర్కొన్నారు. రాత్రి పూట ప్రయాణీకులు ఎక్కువ దూరం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తిరుగుతున్నాయి. దేశంలో మొట్టమమొదటి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ఫిబ్రవరి 15, 2019 లో ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు సెట్ ‘మేక్-ఇన్-ఇండియా’ చొరవకు చిహ్నంగా నిలుస్తుంది.