Breaking : జగన్‌ కి మరో షాక్‌.. పార్టీని వీడనున్న మచిలీపట్నం ఎంపీ!

వైసీపీ అధినేతకు మరో షాక్‌ తగిలింది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి గుడ్‌ బై చెప్పి జనసేనలోకి చేరనున్నట్లు సమాచారం. పేర్ని నానితో బాలశౌరికి గత కొంతకాలంగా వైరం నడుస్తుంది.

Breaking : జగన్‌ కి మరో షాక్‌.. పార్టీని వీడనున్న మచిలీపట్నం ఎంపీ!
New Update

AP Politics : ఏపీ పాలిటిక్స్(AP Politics) లో ప్రధాన పార్టీల అధినేతలకు షాక్‌ ల మీద షాక్ లు తగులుతున్నాయి. మీకు ఈసారి పార్టీలో టిక్కెట్‌ కష్టం అనే మాట వినిపిస్తే చాలు ఠక్కున తట్టబుట్ట సర్దేసుకుని పక్క పార్టీలోకి జంప్‌ అయిపోతున్నారు. ఈ వలసలు ఎక్కువ అధికార పార్టీ వైసీపీలోనే కనిపిస్తున్నాయి.

ఎప్పుడైతే వైసీపీ(YCP) అధినేత, సీఎం జగన్(Jagan) ఎమ్మెల్యేలు, ఎంపీ లతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారో..మాకు ఈసారి టికెట్ లేదు అని ఆయన మాటలతో అర్థమైన నేతలంతా కూడా వైసీపీకి గుడ్‌ బై చెప్పేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి మచిలీపట్నం(Machilipatnam)  ఎంపీ బాలశౌరి(Balasouri) కూడా చేరారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

జనసేనలోకి..

ఆయన అతి త్వరలోనే టీడీపీ- జనసేన(TDP - Janasena) కూటమిలో చేరిపోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తుంది. రెండు రోజుల క్రితం వైసీపీలో నుంచి బయటకు వెళ్లిన క్రికెటర్‌ అంబటి రాయుడు(Ambati Rayudu) నిన్ననే పవన్‌ తో భేటీ అయ్యి ప్రత్యేక మంతనాలు జరిపారు. ఈ క్రమంలోనే రాయుడు కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవర్గాలను అడుగుతున్నట్లు సమాచారం.

రాయుడికి పోటీగా బాలశౌరి...

తాజాగా అంబటి రాయుడికి పోటీగా బాలశౌరి కూడా ఈ రెండు నియోజకవర్గాలను కోరుతున్నారట. అలు వైసీపీలోకి విజయవాడ ఎంపీ కేశినేని నాని చేరిక దాదాపు చివరి స్టేజీకి వచ్చేసింది. ఆయన విజయసాయిరెడ్డితో కలిసి దిగిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నాని వైసీపీలోకి వెళ్లిపోయారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే మచిలీపట్నం పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గ ఎమ్మెల్యేలు బాలశౌరికి టికెట్ ఇవ్వొద్దని జగన్‌ వద్దకు వెళ్లారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జనసేన- తెలుగు దేశం నాయకులను బాలశౌరి ప్రోత్సాహిస్తున్నట్లు జగన్‌ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు.

అంతేకాకుండా మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానితో బాలశౌరికి గత కొంతకాలంగా వైరం నడుస్తుంది. కొద్ది రోజుల కిందట రేవంత్‌ రెడ్డి విందుకు బాలశౌరి హాజరు అయ్యారు. ఈ విషయం తెలిసిన జగన్‌ కొంత అసహనం వ్యక్తం చేశారు. దీంతో జనసేనలోకి వెళ్లాలని బాలశౌరి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈక్రమంలోనే అయితే జనసేన నుంచి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసే అవకాశం, లేకపోతే అవనిగడ్డ, పొన్నూరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే ఛాన్స్‌.

Also read: ప్రాణం తీసిన చికెన్‌ ముక్క.. గొంతులో ఇరుక్కుని యువకుడి మృతి!

#mp-balasouri #andhra-pradesh-elections-tdp #janasena #ycp #machilipatnam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి