Vaddiraju Ravichandra: బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర!

రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ వేసేందుకు రేపటితో గడువు ముగియనున్న నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర పేరును ఖరారు చేశారు. రేపు ఆయన నామినేషన్ వేయనున్నారు.

Vaddiraju Ravichandra: బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర!
New Update

Nama Nageswara Rao: ఈ నెల 27న రాజ్యసభ ఎన్నికలు (Rajya Sabha Elections) జరగనున్నాయి. రేపటితో నామినేషన్లకు గడువు ముగియనుంది. ఈ క్రమంలో రాజ్యసభ అభ్యర్థిగా కసరత్తు చేశారు గులాబీ అధిపతి, మాజీ సీఎం కేసీఆర్ (BRS Chief KCR). ఈ క్రమంలో ఖమ్మం (Khammam) జిల్లా బీఆర్ఎస్ నేతలతో సమావేశం అయ్యారు కేసీఆర్. రాజ్య సభ రేసులో వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra), ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు (Nama Nageswara Rao) ఉన్నారు. మొదటగా వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ అభ్యర్థిగా ఖాయం అనుకున్న బీఆర్ఎస్ అధిష్టానం.. ఎంపీ నామా ఎంట్రీతో ఎవరికి టికెట్ కేటాయించాలనే దానిపై గందరగోళంలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే.. మరోవైపు ఖమ్మం నుంచి ఎంపీగా మరోసారి నామా నాగేశ్వరరావు పోటీ చేస్తారనే చర్చ కూడా ఉంది. తాజాగా కేసీఆర్ జరుగుతున్న ప్రచారాలకు చెక్ పెట్టారు. బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర పేరును ఖరారు చేశారు. రేపు ఆయన నామినేషన్ వేయనున్నారు.

ALSO READ: తెలంగాణలో 95 మంది డీఎస్పీల బదిలీలు

అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..

తెలంగాణ నుంచి రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ విడుదల చేసింది. మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి (Renuka Chowdhury), అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) లకు రాజ్య సభ టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం అవ్వడానికి లైన్ క్లియర్ అయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఖమ్మంలో బీఆర్ఎస్ కు షాక్..

తెలంగాణ ఎన్నికల్లో ఓటమి చెంది అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో విజయ సాధించాలని చూస్తోంది. ఈ క్రమంలో ఖమ్మం (Khammam) జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ గూటికి 20 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) సమక్షంలో కాంగ్రెస్ లో కొత్తగూడెం మున్సిపల్ కౌన్సిలర్లు చేరారు. కండువాలు కప్పి పార్టీలోకి డిప్యుటీ సీఎం భట్టివిక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి ఆహ్వానించారు.

DO WATCH:

#kcr #nama-nageswara-rao #rajyasabha-elections #vaddiraju-ravichandra
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe