Vadapalli Venkateswara: వైభవంగా వాడపల్లి వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు..పాల్గొన్న జగ్గిరెడ్డి దంపతులు
వాడపల్లి దివ్యక్షేత్రంలో శ్రీదేవీ భూదేవీ సమేతుడై స్వయంభువుగా వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైవభవంగా కొనసాగుతున్నాయి. కన్నుల పండువగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. గోవింద నామస్మరణతో ఆలయం మారుమ్రోగింది.