చివరి దశకు చేరుకున్న రెస్క్యూ ఆపరేషన్‌..మరికాసేపట్లో బయటకు కార్మికులు!

ఉత్తర కాశీలో టన్నెల్‌ లో పది రోజుల క్రితం చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌ చివరి దశకు చేరుకుంది. మరి కాసేపట్లలో వారు క్షేమంగా బయటకు రానున్నట్లు రెస్క్యూ ఆపరేషన్‌ అధికారి చెప్పారు.

New Update
చివరి దశకు చేరుకున్న రెస్క్యూ ఆపరేషన్‌..మరికాసేపట్లో బయటకు కార్మికులు!

ఉత్తరాఖండ్‌ లోని ఉత్తర కాశీలో టన్నెల్‌ లో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు చేపట్టిన పనులు తుది దశకు చేరుకున్నాయి. బుధవారం సాయంత్రం నిర్వహించిన ఆపరేషన్‌ సమయంలో ఆగర్‌ మెషిన్‌ కు కొన్ని ఇనుప రాడ్‌ లు అడ్డు తగలడంతో డ్రిల్లింగ్‌ కు అంతరాయం ఏర్పడింది. అధికారులు ముందుగానే వైద్యులను , అంబులెన్స్‌ లను రప్పించి ఘటనా స్థలంలో ఉంచారు.

మరికాసేపట్లో ఈ రెస్కూ ఆపరేషన్‌ పూర్తవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. మరో గంట రెండు గంటల్లో మంచి ఫలితాలే వస్తాయని రెస్య్కూ ఆపరేషన్‌ అధికారుల్లో ఒకరైన గిరీష్‌ సింగ్‌ తెలిపారు. కార్మికులను బయటకు తీసుకుని వచ్చేందుకు పైపులైన్లు వేస్తున్నారు. చెత్తలో ఇరుక్కున్న ఐరన్‌ ముక్కలను తొలగించారు.

బుధవారం సాయంత్రం 6 గంటల సమయానికి సొరంగం కూలిపోయిన భాగం శిథిలాల్లోకి 44 మీటర్ల పొడవున్న '' ఎస్కేప్‌'' పైపును పంపినట్లు ఓ అధికారి తెలిపారు. పది రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న సొరంగంలో కొంత భాగం కూలిపోవడంతో దాని లోపల చిక్కుకుపోయిన కార్మికులను చేరుకునేందుకు అమెరికాలో తయారైన ఆగర్‌ యంత్రం 57 మీటర్ల శిథిలాల ద్వారా డ్రిల్‌ చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.

దీని ప్రకారం 13 మీటర్ల శిథిలాలు మాత్రమే తవ్వాల్సి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గురువారం ఉదయానికి ఆపరేషన్‌ ముగుస్తుందని అధికారి వివరించారు. రెండు రోజుల క్రితం కార్మికులకు 6 అంగుళాల పైప్‌ లైన్‌ ద్వారా ప్రస్తుతం వారికి వేడి వేడి ఆహారాన్ని అధికారులు పంపించారు. తాజాగా వారు టన్నెల్లో ఉన్న చిత్రాలు కెమెరాకు చిక్కడంతో వెలుగులోకి వచ్చాయి. సొరంగం లోపల ఉన్న కార్మికులందరూ కూడా ఆరోగ్యంగానే కనిపించారు.

సొరంగంలో శిథిలాలు పడిపోవడంతో వారంతా 10 రోజులుగా చిక్కుకుపోయారు. రెస్క్యూ టీమ్‌ కొత్త పైప్‌ లైన్‌ ని ఉపయోగించి కెమెరాను లోపలికి పంపింది. దానిలో వారంతా కూడా క్షేమంగా ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా వారిని ఇప్పుడు ప్రతి క్షణం బయట నుంచి మానిటర్ చేయవచ్చు. ముందు వారు ఉన్న ప్రదేశంలో లైటింగ్‌ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

కెమెరా లోపలకు వెళ్లిన తరువాత దాని ముందు నిలబడిన కార్మికులంతా కూడా వాకీటాకీల ద్వారా మాట్లాడారు. బృంద సభ్యులందరూ సమీపంలో నిలబడి ఉన్నారు. వారంతా కూడా ఆరోగ్యంగా, ఫిట్‌ గా కనిపిస్తున్నారు. 10 రోజులుగా లోపల చిక్కుకుని ఉన్న కార్మికులకు సోమవారం రాత్రి వారికి ఆహారంగా కిచిడీ పంపారు.

దానిని బాటిళ్లలో నింపి పైపుల ద్వారా వారికి అందించారు. అంతేకాకుండా వారికి వేడివేడి అల్పాహారం సిద్ధం చేశారు. కార్మికులకు మొబైల్స్‌ తో పాటు మరికొన్ని ఉపయోగకరమైన వస్తువులను వారికి అందించినట్లు అధికారులు వివరించారు. ఆగర్‌ మిషన్‌ ద్వారా కార్మికులు ఉన్న టన్నెల్‌ లోకి ఇనుప పైపును అమర్చే ప్రయత్నం చేస్తున్నారు.

నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ బృందం సాయంత్రం సొరంగంలోకి ప్రవేశించడం కనిపించింది. ప్రత్యేక నిపుణులతో సహా 15 మంది వైద్యుల బృందం తరలింపును ఊహించి సైట్లో మోహరించింది. నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీతో ఫోన్ లో మాట్లాడి సిల్య్కారాలో కొనసాగుతున్న సహాయక చర్యల గురించి సమాచారం తీసుకున్నారు.

Also read: బైజూస్ కు భారీ షాక్‌ ఇచ్చిన ఈడీ..ఆ 9 వేల కోట్ల ఆస్తులకు నోటీసులు జారీ!

Advertisment
Advertisment
తాజా కథనాలు