పోలీసు వాహనంలో ఆసుపత్రిలోకి వెళ్లి డాక్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు!

మహిళా వైద్యురాలిని వేదింపులకు గురిచేస్తున్న వైద్యుడిని ఆసుపత్రి వార్డులోకి పోలీసు వాహనంతో వెళ్లి పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఉత్తరాఖండ్ లో చేసుకుంది. ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

New Update
పోలీసు వాహనంలో ఆసుపత్రిలోకి వెళ్లి డాక్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు!

రిషికేశ్‌లోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళా వైద్యురాలిని.. ఆపరేషన్‌ థియేటర్‌లో పనిచేస్తున్న నర్సింగ్‌ అధికారి సతీష్‌ కుమార్‌ లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో సతీష్ కుమార్‌పై మహిళా డాక్టర్ ఫిర్యాదు చేయగా, వెంటనే చర్యలు తీసుకున్న ఆ రాష్ట్ర పోలీసులు అతన్ని అదుపులో తీసుకోవటానికి పోలీసు వాహనంలో ఆసుపత్రి అత్యవసర వార్డులోకి ప్రవేశించి..సతీష్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణకు తరలించారు. ఈ దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

అరెస్టయిన సతీష్ కుమార్ గతంలో కూడా పలువురు మహిళా వైద్యులకు కూడా అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు కూడా తెలుస్తుంది. సతీష్‌కుమార్‌ను విధుల నుంచి తొలగించి వెంటనే చర్యలు చేపట్టాలని పలువురు వైద్యులు నిరసనకు దిగారు. అయితే పోలీసుల తీరు పై ఓ వైపు ప్రశంసలు వెల్లువెత్తుతున్నా.. మరోవైపు రోగుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ నేరగాడిని పట్టుకోవడానికి ఇలా చేయటం సరికాదని పలువులు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు