Patel Ramesh Reddy: పటేల్ రమేష్ రెడ్డికి ఉత్తమ్ రాసిచ్చిన హామీ పత్రం ఇదే..!

అనేక నాటకీయ పరిణామాల నడుమ సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి ఈ రోజు తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. హైకమాండ్ పెద్దల హామీతో పాటు నల్గొండ ఎంపీగా పోటీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి హామీ పత్రాలు ఇవ్వడంతో రమేష్ రెడ్డి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

New Update
Patel Ramesh Reddy: పటేల్ రమేష్ రెడ్డికి ఉత్తమ్ రాసిచ్చిన హామీ పత్రం ఇదే..!

Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట లభించింది. రెబల్ అభ్యర్థులను బుజ్జగించే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం సఫలం అయింది. నామినేషన్లు వేసిన కొందరు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు వెనక్కి తగ్గారు. తమ నామినేషన్లు వెనక్కి తీసుకొని ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నారు. సూర్యాపేటలో పటేల్‌ రమేశ్‌రెడ్డి, ఇబ్రహీంపట్నంలో దండెం రామిరెడ్డి, జుక్కల్‌లో గంగారం, బాన్సువాడలో బాలరాజు, డోర్నకల్‌లో నెహ్రూ నాయక్‌, వరంగల్‌ వెస్ట్‌లో జంగా రాఘవరెడ్డి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. పార్టీ నిర్ణయించిన కాంగ్రెస్ అభ్యర్థులకు తమ మద్దతును ప్రకటించారు.

ALSO READ: కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీఆర్ఎస్ లోకి కీలక నేత!

సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి నామినేషన్ విత్ డ్రా సందర్భంగా అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ దశలో పటేల్ రమేష్ రెడ్డి అనుచరులు అధిష్టానం దూతలుగా వచ్చిన రోహిత్ చౌదరి, మల్లు రవిపై దాడికి యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. పటేల్ రమేష్ రెడ్డి కూడా కన్నీళ్లు పెట్టుకుని భావోద్వేగానికి గురయ్యారు. అయితే.. రోహిత్ చౌదరి, మల్లు రవి తదితరులు పటేల్ రమేష్ రెడ్డిని బుజ్జగించి ఎంపీ టికెట్ పై హామీ ఇచ్చారు. ఈ విషయమై హైకమాండ్ పెద్దలతోనూ హామీ ఇచ్చారు. గతంలో కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వకుండా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇస్తామని చెప్పి మోసం చేసిందని పటేల్ రమేష్ రెడ్డి అన్నట్లు తెలిసింది. దీంతో ఏకంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డితో రమేష్ రెడ్డి ఎంపీ టికెట్ కు మద్దతు తెలుపుతూ హామీ పత్రాలు రాయించారు. దీంతో చల్లబడ్డ రమేష్ రెడ్డి తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు.

ALSO READ: ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

publive-image
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డికి ఎంపీ టికెట్ కేటాయించాలని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరికి లేఖ రాశారు. రమేష్ రెడ్డికి నల్గొండ ఎంపీ టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నానంటూ లేఖలో పేర్కొన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

#patel-ramesh-reddy #telangana-news #telangana-elections-2023 #congress-rebels #uttam-kumar-reddy
Advertisment
తాజా కథనాలు