Pawan Kalyan : మంత్రిగా పవన్ ప్రమాణ స్వీకారం.. సరికొత్త పోస్టర్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్' టీమ్ స్పెషల్ విషెస్!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ టీమ్ ఓ స్పెషల్ పోస్టర్ తో పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్ష‌లు తెలిపింది. ఈ పోస్ట‌ర్‌లో సనాతన ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… అంటూ రాసుకోచ్చారు.

Pawan Kalyan : మంత్రిగా పవన్ ప్రమాణ స్వీకారం.. సరికొత్త పోస్టర్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్' టీమ్ స్పెషల్ విషెస్!
New Update

Ustaad Bhagath Singh Team Special Wishes To Pawan Kalyan : ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌డంతో రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఈ క్ర‌మంలోనే ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ టీమ్ ఓ స్పెషల్ పోస్టర్ తో పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్ష‌లు తెలిపింది.

సనాతన ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే...

కమర్షియల్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ మరోసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది.

Also Read : షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చిన సురేఖా వాణి.. ఏకంగా అతడితో కలిసి నైట్ పార్టీ!

పవన్ పాలిటిక్స్ తో బిజీగా ఉన్న నేపథ్యంలో షూటింగ్ వాయిదా వేశారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ప‌వ‌న్‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ.. కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇక ఈ పోస్ట‌ర్‌లో సనాతన ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… అంటూ రాసుకోచ్చారు. ఇందులో పవన్ ఖాకీ డ్రెస్ లో చేతిలో సుత్తె పట్టుకున్న లుక్ ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది.

#ustaad-bhagat-singh #pawan-kalyan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe