PM Modi: డీప్‌ఫేక్ వీడియోలపై స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే.. సోషల్ మీడియాలో డీప్‌ఫేక్ వీడియోలు వైరల్ కావడంతో దీనిపై స్పందించిన ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. డీప్‌ఫేక్ వీడియోలు సమాజానికి ముప్పుగా మారుతున్నాయని.. ఇటీవల నేను పాట పాడినట్లు ఓ వీడియో వైరల్ అయిందన్నారు. వీటిపై మీడియా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. By B Aravind 17 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Modi on Deep fake Videos: ఇటీవల సోషల్ మీడియాలో సెలబ్రిటీల డీప్‌ఫేక్ ఫొటోలు, వీడియోలు వైరల్ అవ్వడం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను దుర్వినియోగం చేస్తూ ఇలాంటి డీప్‌ఫేక్ వీడియోలు చేయడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని ఈ విధంగా మాట్లాడారు. ' డీప్‌ఫేక్ వీడియోలు అనేవి మన వ్యవస్థకు ముప్పుగా మారుతున్నాయి. సమాజంలో గందరగోళానికి గురిచేస్తూ సమస్యాత్మకంగా తయారవుతున్నాయి. ఇటీవలే నేను పాట పాడినట్లు కూడా ఓ వీడియో వైరల్ అయ్యింది. కొందరు తెలిసినవాళ్లు.. ఆ వీడియోను నాకు పంపించారు. ఇలాంటి డీప్‌ఫేక్ వీడియోలపై మీడియా, జర్నలిస్టులు ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇలాంటి వీడియోలు వైరల్ అయితే వాటిని అడ్డుకొని వార్నింగ్ ఇవ్వాలని చాట్‌జీపీటీ (ChatGPT) బృందాన్ని తాను అభ్యర్థించినట్లు' ప్రధాని మోదీ పేర్కొన్నారు. Also read: అమిత్ షా షెడ్యూల్ లో మార్పులు ఇటీవల నటి రష్మిక మందన్న (Rashmika Mandanna) ఉన్నటువంటి ఓ డీప్‌ఫేక్ వీడియో వైరల్ కాగా.. ఆ తర్వాత బాలివుడ్ నటులైన కత్రినా కైఫ్, కాజోల్ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన కేంద్రప్రభుత్వం.. మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలపై ఎక్స్(ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సంస్థలకు గైడ్‌లైన్స్ జారీ చేసింది. మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలపై ఏవైన ఫిర్యాదులు వస్తే 36 గంటల్లోపే వాటిని తొలగించాలని ఆదేశించింది. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. Also read: కాంగ్రెస్ నాయకుడిని చెప్పుతో కొట్టిన ఫకీర్ బాబా.. వీడియో వైరల్ #pm-modi #rashmika-mandanna #deep-fake మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి