Mangoes Benefits Hair: మామిడి పళ్లు అంటే అందరికి నోరూరుతుంది. అయితే ఈ పండ్లను తినాలంటే వేసవి వచ్చేవరకు ఎదురు చూడాలి. అయితే.. మామిడి ఆకులు కోసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకే.. పండుగలు, వివాహాది శుభకార్యాలు, పర్వదినాలలో గుమ్మాలకు మామిడాకు తోరణాలు కట్టుకుంటాం. అయితే.. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి, ఆరోగ్య సంరక్షణకు మామిడి ఆకులు ఎంతగానో మెలుచేస్తాయని పరిశోధకులు అంటున్నారు. మామిడి ఆకులలో జుట్టు కుదుళ్లు బలంగా ఉండేదుకు అవసరమయ్యే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే ఎ, ఇ, సి విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇది సాధ్యం అయిందని చెబుతున్నారు.
జుట్టు నల్లగా, ఒత్తుగా ఉంటుంది
మామిడాకులలో పైన చెప్పుకున్న విటమిన్లతో పాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. వీటిని వాడితే జుట్టు బాగా పెరుగుతుంది. అంతేకాకుండా తలపై మామిడి ఆకులను ఉంచి, వాటిని కప్పుతూ ఏదైనా పలుచని క్లాత్‌తో కట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ఇలా చేస్తే తలలో రక్తనాళాలు దెబ్బతినకుండా, రక్త ప్రసరణ పెరుగుతుంది. మామిడి ఆకుల్లో ఉండే సహజ తైలాలు జుట్టు సంరక్షణకు ఉపయోగపడుతుంది. మామిడి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు నెరవకుండా, బలహీనంగా మారకుండా చేస్తుంది. మామిడి ఆకులను ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ఫలితాలూ లేకుండా జుట్టు నల్లగా, ఒత్తుగా ఉంటుంది. మామిడి ఆకులలో ఉండే ఫ్లేవనాయిడ్లు జుట్టును సహజంగా నల్లగా మార్చడంలో, నిగారింపు వచ్చేలా చేస్తుంది.
మామిడి ఆకులను ఇలా ఉపయోగించుకోవాలి
- తాజా మామిడి ఆకులను కొద్దిగా నీరు పోసి మిక్సీలో పేస్ట్‌లా రుబ్బుకోవాలి. దానికి పెరుగు లేదా ఆలివ్ నూనె వేసి కలుపుకోవాలి.ఈ పేస్ట్‌ను జుట్టుకు పట్టించాలి. ఆరిన తరవాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేసుకోవాలి.
- ఎండలో ఎండబెట్టి మామిడి ఆకులను మెత్తగా పౌడర్‌లా చేసుకోవాలి. తర్వాత పేస్ట్ లా చేసి బ్లాక్ టీని కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టుకోవాలి. ఇలా చేస్తే జుట్టుకు చక్కటి పోషణ అందటంతో పాటు జుట్టు నల్లగా ఉంటుంది.
- మధుమేహంతో బాధపడేవారు కొన్ని మామిడి ఆకులను కషాయంలా చాలా మంచిగా పని చేస్తుంది. గోరువెచ్చగా అయ్యాక క్రమం తప్పకుండా కొన్ని రోజులు తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఐస్ వాటర్‌తో ముఖం కడుక్కుంటే ఏమవుతుంది..?