Fish Oil : ప్రాణాన్ని కాపాడే ఫిష్ ఆయిల్.. వాడితే మీ గుండె సేఫ్ చేపల నుంచి వచ్చే ఆయిల్‌లో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలతోపాటు గుండెకు ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది మన శరీరానికి, శరీరం ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది. ఒమెగా-3 ఆమ్లాలు డిప్రెషన్ నుంచి మనల్ని కాపాడుతాయని వైద్యులు అంటున్నారు. By Vijaya Nimma 30 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Fish Oil Is Safe To Heart : చేపల నుంచి వచ్చే ఆయిల్(Fish Oil) లో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా గుండె(Heart) కు ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది మన శరీరానికి ఎంతో అవసరమైన పోషకం. ఈ ఫ్యాటీ యాసిడ్స్(Fatty Acids) మన శరీరం ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది. ముఖ్యంగా మన శరీరంలో రక్తం గడ్డకట్టకుండా చేయడంలో ఈ యాసిడ్‌లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే గుండె, మెదడు ఆరోగ్యానికి(Brain Health), కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఈ ఫ్యాటీ యాసిడ్ అద్భుత ఔషధం అని నిపుణులు అంటున్నారు. అలాగే ఈ ఒమెగా-3(Omega-3) ఆమ్లాలు డిప్రెషన్(Depression) నుండి మనల్ని కాపాడుతాయి. ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహారం తీసుకుంటే ఒత్తిడి, ఆటిజం మొదలైనవి తగ్గుతాయని వైద్యులు అంటున్నారు. కంటి, చెవి వ్యాధులకు ఆసుపత్రుల్లో ఇచ్చే మందులలో ఈ ఒమేగా-3 కచ్చితంగా ఉంటుంది. ఫ్యాటీ యాసిడ్: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఈ ఫిష్ ఆయిల్‌లో అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మాకేరెల్ ఫిష్‌లో ఇవి సమృద్ధిగా మనకు లభిస్తాయి. సాధారణంగా ఒమేగా 3 న్యూట్రీషియన్స్ చేపల్లో ఉన్నప్పటికీ ఇందులో మాత్రం చాలారెట్లు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఈ మాకేరెల్ ఫిష్‌లో ప్రతి 3 ఔన్సులకు 20.2 గ్రాముల ప్రొటీన్ ఉండటంతో ఎప్పుడూ డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. Also Read : మీ జుట్టు రాలుతోందా?.. ఈ పువ్వు తింటే ఇక నో ప్రాబ్లమ్ ఏయే లాభాలు ఉంటాయి? ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆయిల్ ఫిష్ తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఇందులో విటమిన్లు బి5, బి6 పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం, జింక్ ఉంటాయి. కార్బోహైడ్రేట్లు ఉండవు కాబట్టి తొందరగా బరువు తగ్గుతారు. మధుమేహాన్ని నివారించడమే కాకుండా రక్తపోటును అదుపులో ఉంచుతుంది. విటమిన్ డి కూడా ఈ చేపల్లో పుష్కలంగా ఉంటుంది. అందుకే క్యాన్సర్ ఉన్నవారు తరచూ వీటిని తింటే జీవితకాలం పెరుగుతుంది. ప్రేగు క్యాన్సర్: అధిక రక్తపోటు, ప్రేగు క్యాన్సర్ ఉన్నవారు ఫిష్ ఆయిల్ తింటే ఎక్కువ కాలం జీవించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆయిల్ ఫిష్‌లో రోగనిరోధక శక్తి అధికం, కీళ్ల సమస్యలను నివారించే గుణాలు ఉంటాయి కాబట్టి రెగ్యులర్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: వృద్ధుల్లో వినికిడి లోపానికి కారణాలేంటి?.. పరిష్కార మార్గాలు గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #heart-health #fish-oil #fatty-acids మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి