Women Life Style: మనం నిత్యం వంటల్లో వాడే అనాస పువ్వులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీనికి స్త్రీల్లో హార్మోన్లను సమతుల్యం చేసే శక్తి ఉంది. సంతానలేమి సమస్యతో బాధపడేవారు ఈ పువ్వులను తీసుకుంటే ఫలితం ఉంటుంది. అంతేకాదు.. శ్వాసకోశ సమస్యల నుంచి బయటపడొచ్చు. దీనిని ఆహారాలు, పానీయాలతో తాగితే.. సీజనల్ వ్యాధులు దరిచేరవు. దీనిని తినడం వల్ల కంటిచూపు, వికారం, వాంతులు, జ్వరం వంటి సమస్యలను అనాస పువ్వుతో ఉపశమనం కలుగుతుందని వైద్యులు అంటున్నారు.
నిద్రలేమి సమస్యకు అనాస పువ్వు అద్భుతం
ప్రస్తుత కాలంలో స్త్రీ, పురుషులంద్దరూ నిద్రలేమి సమస్యలో బాధపడుతున్నారు. ఇది చిన్న సమస్య ఏ మాత్రం కాదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే.. అనాస పువ్వులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకే నిద్రలేమిని ఎంతో త్వరగా నివారించుకుంటే ఆరోగ్యానికి అంత ముప్పు తగ్గుతుంది. అయితే.. నిద్రలేమిని నివారించడంలో అనాస పువ్వు అద్భుతంగా ఉపయోగపడుతుంది. మసాలా దినుసుల్లో ఒకటైన అనాస పువ్వు ప్రత్యేకమైన రుచి, వాసన కలిగి ఉంటుంది. ఎన్నో పోషక విలువలు ఉన్న అనాస పువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం.
అనాస పువ్వుతో ఎన్నో ప్రయోజనాలు
నిద్రలేమి సమస్య ఉంటే అనాస పువ్వును బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. దీనిని ఎలా తీసుకుంటే నిద్ర సమస్య దూరం అవుతుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఓ పాత్రలో గ్లాస్ వాటర్ పోసి లైట్‌గా మరిగించాలి. ఈ నీటిలో రెండు అనాస పువ్వులు, అనాస పువ్వుల పౌడర్ వేసి బాగా మరిగించి ఫిల్టర్ చేసుకోవాలి. ఈ నీటిని రాత్రి నిద్రించేందుకు గంట ముందు తాగాలి. ఇలా ప్రతి రోజు చేస్తే.. నిద్ర చక్కగా పడుతుంది. నిద్ర లేమి సమస్య క్రమక్రమంగా దూరం అవుతుంది. అనాస పువ్వులు మరిగించిన నీటిని తాగితే జలుబు, దగ్గు, శ్వాస, జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
ఇది కూడా చదవండి: మీకు పానీపూరీ అంటే ఇష్టమా..? అయితే ఇది చదవాల్సిందే!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.