600 రూపాయల శాండ్‌ విచ్‌ కి 6 లక్షల టిప్‌ ఇచ్చిన మహిళ..పొరపాటు తెలిసి లబోదిబో!

అమెరికాలో ఓ మహిళ 600 రూపాయల శాండ్‌ విచ్‌ తిని పొరపాటున 6 లక్షల రూపాయల టిప్‌ ని ఇచ్చింది. పొరపాటు జరిగిన విషయాన్ని తెలుసుకుని ఆమె బ్యాంకు అధికారులకు జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో వారు డబ్బును వెనక్కి ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

New Update
600 రూపాయల శాండ్‌ విచ్‌ కి 6 లక్షల టిప్‌ ఇచ్చిన మహిళ..పొరపాటు తెలిసి లబోదిబో!

సాధారణంగా హోటళ్లు, రెస్టారెంట్లలో ఏమైనా తింటే అక్కడి వారికి పదో పరకో టిప్‌ ఇవ్వడం సహజం. కానీ ఓ మహిళ మాత్రం 7 డాలర్ల శాండ్‌ విచ్‌ తిని, 7 వేల డాలర్ల టిప్‌ ని ఇచ్చింది. భారీ టిప్‌ ని అందుకున్న రెస్టారెంట్‌ సిబ్బంది కూడా పిచ్చ హ్యాపీ అయ్యారు. కానీ అదంతా పొరపాటున జరిగిందని తెలుసుకుని అయ్యో అనుకున్నారు.

అసలేం జరిగిందంటే.. వేరా కార్నర్‌.. అనే ఓ మహిళ అమెరికాలోని ఇటాలియన్‌ సబ్‌ వేలో ఓ శాండ్‌ విచ్‌ తిని బిల్లు చెల్లించే సమయంలో ఏమరపాటుగా ఉంది. 7.54 డాలర్లు కొట్టాల్సిన చోట పొరపాటున వేరే నెంబర్‌ నొక్కొంది. దీంతో రెస్టారెంట్‌ వారికి పెద్ద మొత్తంలో బిల్లు టిప్‌ అందాయి. ఈ మేరకు బిల్లు అందుకున్నాక కానీ వేరా తన పొరపాటును గుర్తించలేదు.

ఆ పై బ్యాంకుకు పరుగులు పెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. తన డబ్బును తిరిగి తన ఖాతాలో జమ చేయాలని వేరా కోరికను బ్యాంకు వాళ్లు ముందు తిరస్కరించారు. దీంతో సబ్‌ వే మేనేజ్‌మెంట్‌ ను ఆశ్రయించినట్లు ఆమె తెలిపారు. దీంతో అక్కడి మేనేజర్‌ తనను బ్యాంకు ను ఆశ్రయించాలని సూచించాడన్నారు.

తిరిగి బ్యాంకుకు వెళ్లగా..విచారణ జరిపించి వేరా సొమ్ము తిరిగిప్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఆ తరువాత బ్యాంకు వాళ్లను ఆశ్రయిస్తే వారు సానుకూలంగా స్పందించారు. పొరపాటున చెల్లించిన టిప్ మొత్తాన్ని తిరిగిచ్చేందుకు అంగీకరించింది. దీంతో వేరా కార్నర్ ఊపిరి పీల్చుకుంది.

Also read: హాట్ టాపిక్ గా నల్గొండ పాలిటిక్స్.. గులాబీల జాతరా? హస్తం హవానా?

Advertisment
Advertisment
తాజా కథనాలు