Hamas: అమెరికా జరుపుతున్న బాంబు (Bomb Attack) ల దాడితో పశ్చిమాసియా దద్దరిల్లిపోతుంది. గత కొద్దిరోజులుగా రక్తం ఏరులై పారుతుంది. కొద్ది రోజుల క్రితం జోర్డన్ లో మిలిటెంట్లు జరిపిన దాడుల్లో ముగ్గురు అమెరికన్ సైనికులు చనిపోయారు. దాంతో ప్రతీకారంతో రగిలిన అమెరికా సిరియాలోని మిలిటెంట్ల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపిస్తోంది.
ఇప్పటి వరకు జరిగిన ఈ దాడుల్లో సుమారు ఇరాన్ (Iran) మద్దతుదారులైన 40 మంది మిలిటెంట్లు మృత్యువాత పడినట్లు సమాచారం.ఈ క్రమంలోనే ఇరాక్ , సిరియాలోని ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్లు, ఇరాన్ రివల్యూషనరీ గార్డుల స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించడం మొదలు పెట్టింది. దీనిని పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ తీవ్రంగా తప్పు పట్టింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చర్యలు దాడులను మరింత ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపించింది.
సామాన్యులను బలి..
ఆ దేశాల్లో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలకు అగ్ర రాజ్యం పూర్తిగా బాధ్యతలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేసింది. ఇజ్రాయెల్ కు సాయం అందిస్తూ పాలస్తీనాలోని సామాన్యులను బలి తీసుకుంటోందని హమాస్ విమర్శించింది. ఇలాంటి చర్యలతో ఉద్రిక్తతలు ఇంకా పెరుగుతాయే తప్ప...తగ్గబోవని హెచ్చరికలు జారీ చేసింది.
ఈ క్రమంలోనే హమాస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్ దురాక్రమణ, గాజాలోని ప్రజలపై మారణ హోమానికి ఎప్పుడు ముగింపు పలుకుతారో అప్పుడే ఆ ప్రాంతాల్లో శాంతి నెలకొంటుందని వివరించింది. కొంతకాలం క్రితం అమెరికా సైనిక క్యాంప్ పై డ్రోన్ దాడి జరపడంతో అమెరికాకు చెందిన ముగ్గురు సైనికులు మృతి చెందారు.
దీనిని సీరియస్ గా తీసుకున్న అమెరికా ఇరాక్, సిరియాల్లోని 85 ప్రాంతాల్లో దాడులు మొదలు పెట్టింది. ఈ దాడుల్లో ఇరాన్ మద్దతిస్తున్న 40 మంది మిలిటెంట్లు మరణించినట్లు ఓ మావన హక్కుల సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ఇరాక్ లో 16 మంది పౌరులు కూడా ప్రాణాలు విడిడిచనట్లు బాగ్దాద్ ప్రకటించింది.