Kamala Harris: డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌.. ఆమోదించిన జో బైడెన్!

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోనుంచి తప్పుకున్న జో బైడెన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ ను బైడెన్ ఆమోదించారు. ట్రంప్‌కు సరైన పోటీదారు కమలా హారీసే అంటూ డెమోక్రటిక్ చట్టసభ సభ్యులు తెలిపారు.

New Update
Kamala Harris: డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌.. ఆమోదించిన జో బైడెన్!

America: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోనుంచి తప్పుకున్న జో బైడెన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ ను జో బైడెన్ ఆమోదించారు. ట్రంప్‌కు సరైన పోటీదారు కమలా హారీసే అంటూ డెమోక్రాటిక్ చట్టసభ సభ్యులు తెలిపారు.

ట్రంప్‌కు సరైన పోటీదారు..
ఈ మేరకు అయితే తొమ్మిది మంది డెమోక్రాటిక్ చట్టసభ సభ్యులు బైడెన్‌ను ప్రెసిడెంట్ రేసు నుంచి తప్పుకోవాలని కోరారు. మరికొందరు డెమోక్రటిక్‌ పార్టీ నేతలు కూడా బైడెన్‌ ఎన్నికల నుంచి తప్పుకోవాలని, కమలా హారీస్‌లో పోటీలో ఉండాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో ట్రంప్‌కు పోటీగా కమలా హారీసే కరెక్ట్‌ పోటీదారు అంటూ పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Joe Biden: ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న జో బైడెన్‌!

ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ పోటీ చేస్తే ప్రచారానికి నిధులు నిలిపివేస్తామని డెమోక్రటిక్‌ పార్టీ దాతలు బెదిరించడంతో కమలా హారీస్‌ రంగంలోకి దిగారు. ఆమె నిధుల సేకరణ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమలా హారీస్‌.. పార్టీకి చెందిన దాతలను శాంతింపజేశారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు