Kamala Harris: డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్.. ఆమోదించిన జో బైడెన్!
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోనుంచి తప్పుకున్న జో బైడెన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ ను బైడెన్ ఆమోదించారు. ట్రంప్‌కు సరైన పోటీదారు కమలా హారీసే అంటూ డెమోక్రటిక్ చట్టసభ సభ్యులు తెలిపారు.