Joe Biden: ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న జో బైడెన్‌!

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి అధ్యక్షుడు జో బైడెన్‌ వైదొలిగారు. డెమోక్రటిక్ పార్టీ, దేశ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుత అధ్యక్షుడిగా పూర్తి కాలం కొనసాగుతానని వెల్లడించారు.

New Update
Joe Biden: ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న జో బైడెన్‌!

Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి అధ్యక్షుడు జో బైడెన్‌ వైదొలిగారు. డెమోక్రటిక్ పార్టీ, దేశ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత అధ్యక్షుడిగా పూర్తి కాలం కొనసాగుతానని వెల్లడించారు. అయితే ఆరోగ్య సమస్యలు, సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకతతోనే బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మరోవైపు చర్చ నడుస్తోంది.

ఇక అమెరికా అధ్యక్ష రేసు నుంచి అధ్యక్షుడు జో బైడెన్‌ వైదొలగాలని సొంత పార్టీ కీలక నేతలే డిమాండ్ చేశారు. ఆయన అభ్యర్థిత్వంపై మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఆందోళన వ్యక్తపరిచారు. పార్టీ సీనియర్‌ నాయకురాలు నాన్సీ పెలోసీ నేరుగా బైడెన్‌కే ఫోన్‌ చేసి.. రేసునుంచి వైదొలగాలని కోరినట్లు వార్తలొచ్చాయి. బైడెన్‌ తప్పుకోకపోతే డెమోక్రాట్ల అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయని, చట్టసభపై నియంత్రణ కోల్పోయే పరిస్థితి తలెత్తుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బైడెన్‌.. ట్రంప్‌ను ఓడించలేరని, బైడెన్‌ వెనక్కి తగ్గాలని కాలిఫోర్నియా డెమోక్రటిక్‌ ప్రతినిధి ఆడమ్‌ కూడా కోరారు. ఈ నేపథ్యంలోనే బైడెన్ ఎట్టకేలకు రేస్ నుంచి తప్పుకున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు