నకిలీ విసాలతో ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లడం చట్టారిత్యా నేరం. ఇలాంటి నేరానికి ఎవరైనా పాల్పడితే ఆయా దేశాలు నిందితులను శిక్షిస్తుంటాయి. అయితే తాజాగా అమెరికాకి చెందిన ఓ వ్యక్తి నకిలీ వీసాతో ఇండియాలోకి ప్రవేశించాడు. దీంతో ఉత్తరప్రదేశ్ కోర్టు అతడికి రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష, రూ.20 వేల జరిమాన విధించింది. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే.. అదనంగా మరో 15 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన ఎరిక్ డేనియల్ బెక్‌విత్ (36) ఈ ఏడాది మార్చి 29న నకిలీ వీసాతో నేపాల్ నుంచి భారత్‌లోకి వచ్చాడు. నేపాల్, ఇండియా సరిహద్దు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ అనే జిల్లాలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడికి సంబంధించిన పత్రాను తనిఖీ చేశారు. అతడి వద్ద నకిలీ వీసా ఉన్నట్లు తేలడంతో పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు.
Also Read: ఒడిశాలో కొనసాగుతున్న ఐటీ సోదాల్లో రూ.300 కోట్లు స్వాధీనం.. బండి సంజయ్ ఫైర్
అలాగే నిబంధనలపై భారత్‌లో ఉన్న అమెరికా ఎంబసీకి, నిఘా వర్గాలకు సమాచారం అందించారు. అయితే ఈ కేసుపై విచారణ జరిపిన మహారాజ్‌గంజ్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సౌరభ్ శ్రీవాస్తవ శుక్రవారం తీర్పునిచ్చారు. నకిలీ వీసాతో వచ్చిన ఎరిక్ డేనియల్‌లో రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ.20 వేల ఫైన్ విధించారు. అయితే ఈ విషయాన్ని మహారాజ్ గంజ్ ఏఎస్పీ అతిష్ కుమార్ సింగ్ ఈ విషయాన్ని శనివారం వెల్లడించారు.
Also read: రైతు బంధు డబ్బు జమ అప్పుడే.. మంత్రి ప్రకటన!