US Visa: అమెరికా వెళ్లాలనుకునేవారికి షాక్.. హెచ్-1బీ సహా పలు కేటగిరీలకు ఫీజులు పెంపు హెచ్-1 బీ వీసా అప్లికేషన్ ఫీజును 460 డాలర్లుగా ఉండగా.. ఇప్పుడు దాన్ని 780 డాలర్లకు పెంచినట్లు బైడెన్ సర్కార్ వెల్లడించింది. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. అలాగే హెచ్-1బీ రిజిస్ట్రేషన్, ఈబీ-5 వీసాల దరఖాస్తు రుసుమును కూడా పెంచినట్లు తెలిపింది. By B Aravind 01 Feb 2024 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి అమెరికాకు వెళ్లాలనుకునే ఇండియన్స్‌పై మరింత భారం పడనుంది. H-1 బీ సహా కొన్ని కేటగిరీల దరఖాస్తు ఫీజులను పెంచుతున్నట్లు తాజాగా అమెరికా ప్రకటించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. చివరిసారిగా 2016లో వీసాల దరఖాస్తుల రుసుమును పెంచారు. ఈ తర్వాత మళ్లీ ఇప్పుడు 2024లో పెంచుతున్నట్లు బైడెన్ ప్రభుత్వం తెలిపింది. అప్లికేషన్ ఫీజు పెంపు ప్రస్తుతం హెచ్-1బీ వీసా అప్లికేషన్ ఫీజు 460 డాలర్లుగా ఉండగా.. ఇప్పుడు దాన్ని 780 డాలర్లకు పెంచారు. అలాగే హెచ్-1బీ రిజిస్ట్రేషన్ ఫీజును కూడా 10 డాలర్ల నుంచి 215 డాలర్ల వరకు పెంచారు. అయితే ఇది 2025 నుంచి అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. మరోవైపు ఎల్-1 వీసా దరఖాస్తు ఫీజును కూడా 460 డాలర్ల నుంచి 1,385 డాలర్లకు పెంచేశారు. Also Read: రూ.లక్ష కోట్లు కాజేసి దేశాన్నే కుదిపేసిన మహిళ.. భారతీయులే అధికం ఈబీ-5 వీసాల దరఖాస్తు రుసుములను కూడా 3,675 డాలర్ల నుంచి ఏకంగా 11,160 డాలర్లకు పెంచారు. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ తమ ఫెడరల్ నోటిఫికేషన్‌లో ఈ విషయాలను వెల్లడించింది. అయితే అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను రిక్రూట్ చేసుకునేందుకు హెచ్-1బీ వీసా అవకాశం కల్పిస్తుంది. అయితే ఈ హెచ్-1బీ వీసాలు వినియోగిస్తున్న వాళ్లలో భారతీయులే అధికం. 1990లో ఈబీ-5 ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. అమెరికన్ స్థానికులకు కనీసం 10 మందికి ఉద్యోగం కల్పించేలా కనిష్ఠంగా రూ.5 లక్షల డాలర్ల పెట్టుబడితో వ్యాపారాలు ప్రారంభించేవారికి ఈ వీసాలను జారీ చేస్తారు. ఇక ఎల్-1 వీసా అనేది కంపెనీలో అంతర్గతంగా బదిలీ అయ్యే ఉద్యోగులకు ఇచ్చే వీసా. మల్టీ నేషనల్ కంపెనీలు విదేశాల్లో ఉన్న తమ బ్రాంచీల నుంచి ఉద్యోగులను కొంతకాలం పాటుగా అమెరికాకు తీసుకొచ్చి అక్కడ విధులు నిర్వహించడానికి ఈ ఎల్-1 వీసా అనేది అవకాశం కల్పిస్తుంది. Also Read: ‘నన్ను క్షమించండి’ 😢.. ఎమోషనల్ అయిన మార్క్ జూకర్‌బర్గ్ #telugu-news #usa #h-1b-visa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి