Job Alert: నిరుద్యోగులకు గోల్డెన్ ఆఫర్...ఉచిత శిక్షణ,భోజనంతోపాటు ఉద్యోగం..పూర్తి వివరాలివే..!! వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులకు శుభవార్త. జలాల్పూర్ లోని స్వామి రామానందతీర్త గ్రామీణ సంస్థ బేసిక్ కంప్యూటర్స్, కంప్యూటర్ హార్డ్ వేర్ అసిస్టెంట్, ఆటోమొబైల్ టూవీలర్ సర్వీసింగ్, సోలార్ సిస్టమ్ సర్వీసుల్లో ఫ్రీ శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ పిఎస్ఎస్ఆర్ లక్ష్మీ తెలిపారు. By Bhoomi 04 Feb 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి Job Alert: రాష్ట్రంలో నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు సర్కార్ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రత్యేక జాబ్ మేళాలను కూడా నిర్వహిస్తోంది. నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ భద్రత కల్పించడమే లక్ష్యంగా అన్ని జిల్లాల్లోనూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. దీంతో చాలా మంది నిరుద్యోగులకు ఊరట లభిస్తుందనే చెప్పవచ్చు. పదో నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులకు ప్రైవేట్ కంపెనీలు కూడా ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వస్తున్నాయి. అయితే సరైన ట్రైనింగ్ లేక పోవడంతో ఎంతో మంది అభ్యర్థులు ఉద్యోగాలకు సెలక్ట్ కావడం లేదు. అందుకే కొన్ని సంస్థ ప్రభుత్వ సహకారంతో ఫ్రీ ట్రైనింగ్ తోపాటు ఉచిత వసతి కూడా కల్పిస్తున్నాయి. ఇలాంటి శిక్షణ కేంద్రాల నిర్వహణ పట్ల నిరుద్యోగులుకూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఎందరో నిరుద్యోగులు జాబ్ మేళాల ద్వారా ఉపాధి పొంది తమ కుటుంబ పోషణ కూడా సాగిస్తున్నారు. జిల్లాల వారీగా జాబ్ మేళాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులకు జలాల్పూర్ లోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ(Swami Ramananda Theertha Rural Society) ఫ్రీట్రైనింగ్ తోపాటు ఉద్యోగ అవకాశాన్నికూడా కల్పిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ పిఎస్ఎస్ఆర్ లక్ష్మీ తెలిపారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారికి బేసిక్ కంప్యూటర్స్, కంప్యూటర్ హార్డ్ వేర్ అసిస్టెంట్, ఆటోమొబైల్ టూవీలర్ సర్వీసింగ్, ఎలక్ట్రిషన్, సోలార్ సిస్టమ్ సర్వీసుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ పిఎస్ఎస్ఆర్ లక్ష్మీ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్జీ అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. 18ఏళ్ల నుంచి 35ఏళ్ల వయస్సుగా గ్రామీణ ప్రాంతానికి చెందినవారు అర్హలుని పేర్కొన్నారు. ఆసక్తిఉన్న అభ్యర్థులు ఈనెల 7వ తేదీలోగా ఉదయం 10గంటలకు హాజరుకావాలని తెలిపారు. ఇది కూడా చదవండి: వాలంటైన్స్ డే స్పెషల్ ఆఫర్…ఈ 6 మొబైల్స్ పై అద్భుతమైన డిస్కౌంట్..ఏకంగా 40శాతం..!! ఈ ఆఫర్ ను ఉమ్మడి జిల్లాలకు చెందిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు 9133908000, 9948466111 నెంబర్ సంప్రదించవచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ ఆఫర్ ను మిస్ చేసుకోకండి. #swami-ramananda-theertha-rural-society #warangal #jobs-alert #jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి