Nuclear Bomb: వామ్మో.. హిరోషిమా కంటే 24 రేట్లు శక్తిమంతమైన అణుబాంబు తయారీకి ఆ దేశం సిద్ధం.. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు కంటే 24 రేట్లు శక్తిమంతమైన అణుబాంబును తయారు చేసేందేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ప్రపంచంలో భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఈ అణుబాంబును తయారుచేయడం అనివార్యమవుతోందని అమెరికా రక్షణశాఖ తెలిపింది. దీనివల్ల తమ దేశంతో సవాలు చేయాలనుకునేవారికి కష్టతరమవుతుందని పేర్కొంది. By B Aravind 31 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హిరోషిమా నగరంపై అమెరికా అణుబాంబు వేసిన సంగతి తెలిసిందే. ఈ అణుబాంబు వేలాది మంది ప్రాణాలను బలితీసుకోవడమే కాకుండా కొన్ని దశాబ్దాల పాటు ఆ ప్రాంతాన్ని కోలుకోకుండా చేసింది. అంతేకాదు ప్రపంచ చరిత్రలో చూసుకుంటే అత్యంత విధ్వంసకరమైన దాడిగా ఇది నిలిచిపోయింది. అయితే ఇంతకంటే మరింత శక్తిమంతమైన అణుబాంబును తయారుచేసేందుకు సిద్ధమైపోయింది అమెరికా. హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబుతో పోల్చి చూస్తే.. 24 రేట్లు శక్తిమంతమైన అణుబాంబును తయారుచేసే యోచనలో ఉన్నామని పెంటగాన్ తెలిపింది. బీ61 కొత్త వేరియంట్ న్యూక్లియర్ గ్రావిటీ బాంబును తయారు చేయబోతున్నామని అమెరికా రక్షణశాఖ పేర్కొంది. బీ61-13 పేరుతో దీన్ని రూపొందించనున్నామని.. నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో ఈ అణుబాంబును తయారు చేయనున్నట్లు చెప్పింది. అయితే ఈ అణ్వాయుధాన్ని తయారు చేయాలని ఒక్కసారిగా నిర్ణయం తీసుకోలేదని.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా దీని తయారీ అవసరమైనట్లు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఆమోదం, కేటాయింపు అంశాలు చట్టసభ ముందు పెండింగులో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిరంతరం మారుతున్న ప్రపంచంలోనే అమెరికా మరింత శక్తిమంతంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు అమెరికా రక్షణశాఖ తెలిపింది. ఈ అణుబాంబు వల్ల తమ దేశాన్ని సవాలు చేయాలనుకునే వారికి కష్టతరమే అవుతుందని చెప్పింది. ఒకవైపు రష్యా దూకుడుతనం, మరోవైపు 2030 నాటికి అణ్వాయుధాల సామర్థ్యాన్ని వెయ్యికిపైగా పెంచేందుకు చైనా సిద్ధం అవుతోందనే వార్తల నేపథ్యంలో అమెరికా నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. Also Read: హమాస్ చెర నుంచి తమ దేశ సైనికురాలిని విడిపించుకున్న ఇజ్రాయెల్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1945లో జపాన్‌లోని హిరోషిమాపై ప్రయోగించిన బాంబు 15 కిలో టన్నుల శక్తిని విడుదల చేయగా.. నాగసాకిపై విడిచిన బాంబు 25 కిలోటన్నులు శక్తిని విడుదల చేసింది. కానీ ప్రస్తుతం అమెరికా తయారు చేయనున్న ఈ బీ61-13 అణుబాంబు మాత్రం 360 కిలోటన్నుల శక్తిని ఉత్పత్తి చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. అంటే ఇది హిరోషిమాపై ప్రయోగించిన దానికంటే 24 రెట్లు ఎక్కువ. #america-news #nuclear-bomb #world-war-2 #usa-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి