Urvashi Rautela: రిషబ్ పంత్ ను మోసం చేసిన ఊర్వశీ.. మరొకరితో లవ్ ట్రాక్.. ఫొటో వైరల్!

భారత క్రికెటర్ రిషబ్ పంత్ రూమర్ గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా మరో ఆటగాడితో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ప్లేయర్ కరీయ్ బెంజెమాతో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఊర్వశీ.. కరీయ్ తో క్లోజ్ గా దిగిన ఫొటో వైరల్ అవుతోంది.

New Update
Urvashi Rautela: రిషబ్ పంత్ ను మోసం చేసిన ఊర్వశీ.. మరొకరితో లవ్ ట్రాక్.. ఫొటో వైరల్!

Urvashi Rautela Dating Karim Benzema: భారత క్రికెటర్ రిషబ్ పంత్ రూమర్ గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా మరోసారి వార్తల్లో నిలిచింది. కొంతకాలంగా రిషబ్ తో లవ్ ట్రాక్ నడిపిస్తోందంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా కొంతకాలానికి పుకార్లకు చెక్ పడింది. అయితే తాజాగా మరో ఆటగాడితో ఊర్వశీ ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది.

క్లోజ్ గా దిగిన ఫొటోలు షేర్..
ఈ మేరకు ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ప్లేయర్ కరీయ్ బెంజెమాతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు వీరికి సంబంధించిన ఫొటో, వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని, చాలా క్లోజ్ గా ఉన్న ఫొటోలు సైతం బటయటకొచ్చినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా ఊర్వశీ రౌతేలా ఫుట్‌బాల్ ప్లేయర్ కరీయ్ బెంజెమాతో ఉన్న ఫొటోను తానే స్వయంగా షేర్ చెయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. దీనిపై పలువురు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రిషబ్ ను మోసం చేసిదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: రోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్.. బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియ‌న్స్ షోలో అనౌన్స్!

Advertisment
Advertisment
తాజా కథనాలు