/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-27-2-jpg.webp)
Urvashi Rautela Birthday Cake: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫేమస్ మోడల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్ లో నటిస్తూ బిజీగా సాగుతోంది. 2014 లో ప్రముఖ పాప్ సింగర్ యోయో హనీ సింగ్ 'లవ్ డోస్' అల్బమ్‌తో పాపులరైన ఊర్వశీ ఆ తర్వాత.. వరుసగా సూపర్ హిట్ ఆల్బమ్స్ చేసి యూత్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఇటీవలే తెలుగులో 'వాల్తేరు వీరయ్యలో' మెగాస్టార్ సరసన, బ్రో సినిమాలో పవర్ స్టార్ సరసన సూపర్ హిట్ ఐటమ్ సాంగ్స్ కు స్టెప్పులేసి సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయ్యింది ఈ బ్యూటీ.
Also Read : Director Yashasvi : ‘నాలా ఇంకెవరూ మోసపోవద్దు’.. మ్యూజిక్ డైరెక్టర్ రధన్ పై వైరలవుతున్న యశస్వి కామెంట్స్
బర్త్ డేకు బంగారపు కేక్ కట్ చేసిన హీరోయిన్
అయితే తాజాగా ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ మరోసారి వార్తల్లో నిలిచింది. ఫిబ్రవరి 25న ఈమె పుట్టిన రోజు వేడుకల సందర్భంగా.. ఏకంగా 3 కోట్ల విలువైన 24 క్యారెట్స్ గోల్డ్ కేక్ ను కట్ చేసింది. ప్రముఖ పాప్ సింగర్ యోయో హనీ సింగ్ (YO YO Hone Singh) ఈ కేక్ ను ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ వైరలవుతున్నాయి. ఈ విషయం తెలిసి ఆశ్చర్యానికి గురైన నెటిజన్లు రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వావ్ అంటూ ప్రశంశలు కురిపించగా.. మరికొంతమంది బర్త్ డే కు బంగారపు కేక్ ఏంటీ..? వింతగా అని కామెంట్స్ పెడుతున్నారు.
Also Read : Samantha Ruth Prabhu: సమంత వర్క్ ఔట్స్.. ఆ సినిమా కోసమే.. వైరలవుతున్న పోస్ట్