PM Kisan: అకౌంట్లో డబ్బులు పడాలంటే.. ఇది తప్పనిసరి! పీఎం కిసాన్ 15వ విడత నిధి విడుదలపై కీలక అప్డేట్ వచ్చింది. దీపావళి పండుగ వస్తున్న నేపథ్యంలో ముందుగానే డబ్బు విడుదల చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈకేవైసీ పూర్తైన రైతుల ఖాతాల్లోనే డబ్బు జమ అవుతుందని ప్రభుత్వం తెలిపింది. By V.J Reddy 09 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి కేంద్ర ప్రభుత్వం దేశ రైతులకు ఆర్థికంగా బలం చేకూర్చేందుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM KISAN) పథకాన్ని 2019లో ప్రవేశ పెట్టింది. ఈ పథకం ద్వారా రైతులకు ప్రతి నాలుగు నెలలకు 2 వేల రూపాయల చొప్పున సంవత్సరానికి 6 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తుంది కేంద్రం. తాజాగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క 15వ విడత ఈ నెలలో పంపిణీ చేయవలసి ఉన్నందున రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. దీపావళి పండుగ సందర్భంగా 15వ విడత నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ALSO READ: బుల్డోజర్లతో వెళ్లి నామినేషన్ వేసిన బీజేపీ నేత! అకౌంట్లో డబ్బులు జమ అవ్వాలంటే.. లబ్ధిదారులు కచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేసుకుని ఉండాలని అధికారులు తెలిపారు. లేకుంటే వారు పథకం ప్రయోజనాలను కోల్పోతారని పేర్కొన్నారు. ఈకేవైసీని ఇలా పూర్తి చేయండి: * పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ సందర్శించండి. * రైట్ సైడ్‌లో ఉన్న హోమ్ పేజీకి దిగువన.. మీకు ఫార్మర్స్ కార్నర్ కనిపిస్తుంది. * e-kyc అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. * మీ ఆధార్ నంబర్, ఇతర అవసరమైన సమాచారాన్ని ఎంటర్ చేయండి. * మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే.. ఈ కేవైసీ కంప్లీట్ అవుతుంది. కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటే ఇలా చేయండి: * అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ను సందర్శించండి. * న్యూఫార్మర్ రిజిస్ట్రర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. * అప్లై చేసుకోవడానికి లాంగ్వేజ్‌ను ఎంచుకోండి. * మీరు పట్టణ ప్రాంతంలోని రైతు అయితే.. అర్బన్ ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ని ఎంచుకోండి. * మీరు గ్రామీణులైతే గ్రామీణ రైతు రిజిస్ట్రేషన్‌ని ఎంచుకోండి. * ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, రాష్ట్రం ఎంచుకోండి. * మీ భూమి వివరాలను నమోదు చేయండి. * అదేవిధంగా భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఇతర పత్రాలు అప్‌లోడ్ చేసి.. సేవ్ బటన్‌పై క్లిక్ చేయండి. * క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ OTPకి వెళ్లి సబ్మిట్ చేయండి. * మీ మొబైల్ నంబరుకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే.. మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. #money #pm-kisan #pm-kisan-15th-installment-date మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి